The Raja Saab OTT Record: రెబల్ స్టార్ ప్రభాస్ అనే బ్రాండ్ సాధారణమైనది కాదు.. ఈ బ్రాండ్ వేల్యూ మార్కెట్ లో ఏ మాత్రం తగ్గలేదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ మన టాలీవుడ్ ని ‘రెబల్ వుడ్’ అని పిలుస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రభాస్ సృష్టించే అద్భుతాలను చూస్తుంటే , అది నిజమేనేమో అని అనిపించక తప్పదు. అందుకు ది బెస్ట్ ఉదాహరణగా నిల్చింది , ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆయన నుండి విడుదలైన ‘ది రాజా సాబ్’ చిత్రం. కమర్షియల్ గా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్. కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మన టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ లేదు అనడంలో అతిశయోక్తి లేదు.
అయితే బిజినెస్ చాలా పెద్దగా జరిగింది కాబట్టి , కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. థియేటర్స్ లో డిజాస్టర్ అయినప్పటికీ, ఓటీటీ లో మాత్రం ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందే ఈ చిత్రాన్ని ‘జియో హాట్ స్టార్’ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. సినిమా ఫ్లాప్ అయ్యింది కదా, పాపం హాట్ స్టార్ వాళ్లకు భారీ నష్టం అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ చిత్రానికి హాట్ స్టార్ లో అమోఘమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు తో పాటు , ఇతర ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు 17.5 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తోటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు కూడా ఈ రేంజ్ వ్యూస్ రాలేదు. దీన్ని బట్టీ ప్రభాస్ బ్రాండ్ వేల్యూ ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోండి.
ఈ ఏడాది డిసెంబర్ 3 న విడుదల అవ్వబోయే ‘ఫౌజీ’ మూవీ కి కానీ , వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల అవ్వబోయే ‘స్పిరిట్’ మూవీ కి కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ప్రభాస్ బ్రాండ్ పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించే విద్వంసాన్ని ఊహించడం కూడా కష్టమే. ఈ రెండు చిత్రాల్లో ‘ఫౌజీ’ చిత్రానికి నిన్న మొన్నటి వరకు పెద్దగా హైప్ లేదు కానీ , నిన్న విడుదల చేసిన పోస్టర్ తో ఒక్కసారిగా హైప్ ఆకాశాన్ని అంటింది. చూడాలి మరి ఈ రెండు సినిమాలు సృష్టించే బాక్స్ ఆఫీస్ విద్వంసం ఎలాంటిది అనేది.
