SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని స్టార్ట్ చేశారు. అది 1300 కోట్లు అయింది. ప్రస్తుతం 1500 కోట్లు అవుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా బడ్జెట్ మరో 100 కోట్లు పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఎందుకిలా సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా అవుతుంది అంటూ రాజమౌళిని కొంతమంది అడుగుతున్నారు. దానికి రాజమౌళి సైతం తన సన్నిహితుల దగ్గర కొన్ని వివరణలైతే ఇచ్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి సినిమా బడ్జెట్ పెరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు అనుకున్న సన్నివేశాలను పర్ఫెక్ట్ గా చిత్రీకరించడానికి ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది.
అలాగే హాలీవుడ్ నుంచి టెక్నాలజీని, కొంతమంది టెక్నీషియన్స్ ను సైతం తీసుకురావడం వల్ల బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా పెరిగిపోతుందని రాజమౌళి తన సన్నిహితులు దగ్గర చెబుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తను అనుకున్న రీతిలో సినిమాను చేయగలిగితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలుస్తుందనేది వాస్తవం…
రాజమౌళి ఊహకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే అనే విషయాన్ని సినిమా మేకర్స్ స్పష్టం చేస్తున్నారు… మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు… తను అనుకున్నది అనుకున్నట్టుగా తీసేంతవరకు రాజమౌళి వదిలిపెట్టాడు. కాబట్టి ఈ సినిమాతో ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలాల విస్తరింపజేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో విజయాలను సాధించిన వారు ఎంతమంది ఉన్నా కూడా రాజమౌళిని మించిన దర్శకుడు మరెవరు లేరు ఇకమీదట రారు అనేది వాస్తవం… ఈ సినిమాతో మహేష్ బాబు సైతం ఓవర్ నైట్ లో పాన్ వరల్డ్ స్టార్ హీరోగా మారబోతున్నాడు అనేది వాస్తవం…






