Anchor Srimukhi : బుల్లితెర కు చాలా రీచ్ ఉంటుంది. అందులో కనిపించే యాంకర్లకు, ఇతర నటులకు బయట ప్రపంచంలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరను ఏలిన వారు ఆ తర్వాత క్రమంలో వెండి తెరలోనూ మెరిశారు. చివరికి వెండితెరను ఏలుతున్న వారు కూడా తమ సినిమా ప్రమోషన్లకు బుల్లితెరనే ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడంటే సోషల్ మీడియా కాలం కాబట్టి బుల్లితెరను కాస్త ఓటీటీ లు డామినేట్ చేస్తున్నాయి. రకరకాల షోలతో ప్రేక్షకులను కట్టిపటిస్తున్నాయి. అలా తెలుగు వారికి సుపరిచితమైనది ఆహా ఓటీటీ. పూర్తి తెలుగు నేటివిటీతో ఇందులో వివిధ రకాలైన షోలు ప్రసారమవుతున్నాయి. అందులో మొత్తం తెలుగు వారే ఉండటంతో అవి వెంటనే క్లిక్ అవుతున్నాయి. అయితే ఇందులో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆధ్వర్యంలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ప్రోగ్రాం నడుస్తోంది. దీనికి యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తోంది.. జబర్దస్త్, ఇక ఇతర కామెడీ షోలలో గుర్తింపు పొందిన కమెడియన్లతో ఈ షోను నడిపిస్తున్నారు. కొత్త దనానికి పెద్ద పీట వేయడంతో ప్రేక్షకులను ఇది కొంతమేర ఆకట్టుకుంటున్నది. అయితే త్వరలో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కు సంబంధించి విడుదల చేసిన ప్రోమో చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వివిధ గ్రూపులకు సంబంధించిన కంటెస్టెంట్లు తమ స్కిట్లతో అలరించారు.. సద్దాం, భాస్కర్, యాదమ్మ రాజు, హరి వంటి వారు తమకు అలవాటైన కామెడీని ప్రదర్శించారు. ఈ షోకు ఈసారి స్పెషల్ గెస్ట్ గా సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ వచ్చారు. బ్రహ్మాజీని పరిచయం చేసే క్రమంలో యాంకర్ శ్రీముఖి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బ్రహ్మాజీని స్పెషల్ గెస్ట్ గా తీసుకొస్తున్నారు అనుకుంటే నేను ప్రత్యేకంగా రెడీ అయి వద్దును కదా అని అనిల్ రావిపూడి అంటే.. శ్రీముఖి వెంటనే అందుకుని నేను వేసుకొచ్చిన డ్రెస్ ను ఇంకా కట్ చేసుకుని వచ్చే దాన్ని అంటూ తన కాళ్లు చూపిస్తూ అనేసింది. అప్పటికే ఆ డ్రెస్సు ఆమె మోకాలి పై భాగం దాకా కట్ చేసి ఉంది. అలాంటి డ్రెస్సును ఇంకా కట్ చేసుకునే దాన్ని అని ఆమె అనడం అత్యంత జుగుప్సాకరంగా ఉంది. కామెడీ షో లు అంటే అంగాంగ ప్రదర్శన ఉండాల్సిందే అనేనా శ్రీముఖి ఉద్దేశం. అలా ఉంటేనే ప్రేక్షకులు కళ్ళు అప్పగించుకొని చూస్తారనేదేనా ఆమె భావన. అలా అయితే ఆ మధ్య ఆమె నటించిన సోకాల్డ్ కామెడీ సినిమా తన్నేసింది. అందులో స్కిన్ షో చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
బుల్లి ధరపై శ్రీముఖి స్పాంటేనిటీకి తిరుగుండదు. ఒంటి చేత్తో షో ను నడిపించగల సత్తా ఆమె సొంతం. చాలా సంవత్సరాలుగా ఫీల్డ్ లో ఉంది కాబట్టి ఇలాంటివి ఆమెకు కొట్టినపిండి. కానీ రాను రాను ఆమెలో ఆ స్పాంటినేటి తగ్గిపోయి ఇలాంటి వెగటు ప్రదర్శనలు తెరమీదకి వస్తున్నాయి. చూసే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. డ్రెస్ ఇంకా కట్ చేసుకుని వద్దును అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఓహో దీన్నే కామెడీ అనుకోవాలా? లేక కామెడీ షో లల్లో యాంకరింగ్ అంటే ఇలాంటి ప్రమాణాలు పాటిస్తారు అని అనుకోవాలా? ఏంటో రాను రాను అందరూ అనసూయలు అయిపోతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Anchor srimukhi mischief with actor brahmaji
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com