Hanuman Vs Guntur Karam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా పేరు పొందిన మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటుగా ప్రేక్షకులలో కూడా చెరగని ముద్రను వేసేలా ఆయన సినిమాలను తీర్చిదిద్దుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు ఆయన చేసిన యువరాజు సినిమాలో ఆయన కొడుకుగా నటించిన నటుడు తేజ సజ్జా ప్రస్తుతం హీరో గా మారి హనుమాన్ అనే సినిమా చేసి మహేష్ బాబు తో పాటు పోటీ గా ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.
సంక్రాంతి కానుక గా వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సంక్రాంతి కి 5 పెద్ద సినిమాలు పోటీ కి రెఢీ గా ఉన్నాయి. ఇక అందులో తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ కూడా ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేస్తున్న గుంటూరు కారం సినిమా కూడా సంక్రాంతి కానుక గా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలలో నటించిన నటుడు తేజ సజ్జా హీరోగా మారి ఇప్పటికే పలు సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు మాత్రం మహేష్ బాబు కి పోటీని ఇచ్చే స్థాయి కి ఎదిగాడు అని ట్రేడ్ పండితులు సైతం భావిస్తున్నారు.
ఇక తేజ సజ్జా మహేష్ బాబు తో పోటీగా వస్తున్నాడు అంటే ఆయన కెరియర్ లో ఆయన ఎంతవరకు ఎదిగాడో మనం అర్థం చేసుకోవచ్చు అంటూ వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయం మీదనే విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. మహేష్ బాబు తన కొడుకుతోనే పోటీ పడుతున్నాడు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం మహేష్ బాబు తో పోటీ పడే స్థాయికి తేజ ఎదిగాడు అంటే ఆయనకు సినిమా మీద ఉన్న ఫ్యాషనే దానికి ముఖ్య కారణం అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఇప్పటికే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా సినిమా చేసి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లోనే మళ్లీ ఇంకోసారి హనుమాన్ అనే సినిమా వస్తుంది. ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…