https://oktelugu.com/

అక్కపై ప్రేమతో.. అఖిలప్రియ కోసం చెల్లి, తమ్ముడు ఆక్రందన

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అక్క, మాజీ మంత్రి అఖిలప్రియ చెంచెల్ గూడ జైల్లో అష్టకష్టాలు పడుతుంటే ఆమె చెల్లి, తమ్ముడు తట్టుకోలేకపోతున్నారు. అమ్మానాన్న లేని వీరి కుటుంబానికి అక్క అఖిలప్రియనే దిక్కు. తాజాగా ఓ భూవివాదంలో కిడ్నాప్ నకు ప్రయత్నించి ఆమె అడ్డంగా బుక్ అయ్యి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. Also Read: కిడ్నాప్ కేసు: అఖిలప్రియ చుట్టూ ఎన్ని కథలో? ఈ క్రమంలోనే అటు ఇప్పటికే అమ్మానాన్న చనిపోవడం.. అక్క అఖిలప్రియ జైలుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2021 / 07:33 PM IST
    Follow us on

    సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అక్క, మాజీ మంత్రి అఖిలప్రియ చెంచెల్ గూడ జైల్లో అష్టకష్టాలు పడుతుంటే ఆమె చెల్లి, తమ్ముడు తట్టుకోలేకపోతున్నారు. అమ్మానాన్న లేని వీరి కుటుంబానికి అక్క అఖిలప్రియనే దిక్కు. తాజాగా ఓ భూవివాదంలో కిడ్నాప్ నకు ప్రయత్నించి ఆమె అడ్డంగా బుక్ అయ్యి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది.

    Also Read: కిడ్నాప్ కేసు: అఖిలప్రియ చుట్టూ ఎన్ని కథలో?

    ఈ క్రమంలోనే అటు ఇప్పటికే అమ్మానాన్న చనిపోవడం.. అక్క అఖిలప్రియ జైలుకు పోవడంతో ఆమె చెల్లి, తమ్ముడి బాధ వర్ణనాతీతంగా మారింది.

    తాజాగా వీరిద్దరూ కూడా మీడియాతో మాట్లాడుతూ వాపోయారు. ‘తన అక్క అఖిలప్రియ ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని.. ఆమెపై చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవు’ అని భూమా మౌనిక తెలిపింది. రాత్రికి రాత్రి ఏవీ సుబ్బారెడ్డిని ఏ1 నుంచి ఏ2గా ఎందుకు మార్చారని నిలదీసింది. మా అక్కను కలవడానికి వెళితే ఆమె కళ్లు తిరిగి పడిపోయిందని.. ఆరోగ్య సమస్యలపై కోర్టులో సరిగా సమర్పించలేని వ్యవస్థ ఉందని అన్నది. ఈ భూవివాదం మా నాన్న ఉన్నప్పటి నుంచి ఉందని.. సివిల్ మ్యాటర్ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందని.. మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారని వాపోయింది.

    ఆళ్లగడ్డ వ్యక్తులమని.. ఫ్యాక్షన్ నేతలమని.. సంస్కారం లేని వాళ్లుగా చిత్రీకరిస్తున్నారని మౌనిక వాపోయింది. మేం టీఆర్ఎస్ కు ఓటు వేయలేదా? రాజకీయ ఒత్తిడుల వల్లే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వాపోయింది. వేరే రాష్ట్రాల్లో ఆస్తులు ఉంటే ఇంతలా వేధిస్తారా? కేసీఆర్ కుటుంబానికి వేడుకుంటున్నానని.. మా అక్కను బతికించండని మౌనిక అభ్యర్థించింది..

    Also Read: బర్డ్‌ ఫ్లూ.. భయం అస్సలే వద్దు

    అఖిల ప్రియ సోదరుడు భూమా జగన్ విఖ్యాత్ రెడ్డి సైతం మీడియా ముందుకు వచ్చాడు. రాజకీయంగా తమను వేధిస్తున్నారని.. తమ సోదరిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించాడు. హఫీజ్ పేట భూములు మావేనని.. తెలంగాణ సీఎం కేసీఆర్ న్యాయం చేయాలని విఖ్యాత్ రెడ్డి వేడుకున్నాడు.

    ఇలా అక్క అఖిలప్రియ కోసం చెల్లి, తమ్ముడు పడ్డ వేదన.. మీడియా ముందుకొచ్చి వేడుకున్న తీరు ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది. మరి వీరి గోసను కేసీఆర్ వింటారా? వినరా అన్నది చూడాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్