https://oktelugu.com/

బాలయ్య అయితే ఏంటి.. నేను హీరోయిన్ !

కొంతమంది హీరోయిన్ల ఆలోచనలు మరీ కమర్షియల్ గా ఉంటాయి. ఒక షాప్ ఓపెన్ చేయడానికి కూడా లక్షలు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఓ బ్యూటీ నిర్మాతకు చుక్కలు చూపిస్తోందట. పైగా, ఆ సినిమాలో హీరో బాలయ్య బాబు. అయితే నాకేంటి..? నేను అడిగినవి ఇస్తేనే షూటింగ్ కి వస్తాను, లేకపోతే నేను షూట్ లో పాల్గొనలేను అని పట్టుబట్టి కూర్చింది టాల్ బ్యూటీ ‘ప్రగ్య జైస్వాల్’. అసలుకే బాలయ్య సినిమా అంటే.. పొద్దునే 7 గంటలకు షూట్ […]

Written By:
  • admin
  • , Updated On : January 8, 2021 / 07:35 PM IST
    Follow us on


    కొంతమంది హీరోయిన్ల ఆలోచనలు మరీ కమర్షియల్ గా ఉంటాయి. ఒక షాప్ ఓపెన్ చేయడానికి కూడా లక్షలు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఓ బ్యూటీ నిర్మాతకు చుక్కలు చూపిస్తోందట. పైగా, ఆ సినిమాలో హీరో బాలయ్య బాబు. అయితే నాకేంటి..? నేను అడిగినవి ఇస్తేనే షూటింగ్ కి వస్తాను, లేకపోతే నేను షూట్ లో పాల్గొనలేను అని పట్టుబట్టి కూర్చింది టాల్ బ్యూటీ ‘ప్రగ్య జైస్వాల్’. అసలుకే బాలయ్య సినిమా అంటే.. పొద్దునే 7 గంటలకు షూట్ స్టార్ట్ కావాలి. కానీ, ప్రగ్య మాత్రం సెట్ లోకే రెండు గంటలు ఆలస్యంగా వస్తోందట. ఒకవేళ నా పార్ట్ ఉంటే చెప్పండి.. ఆ రోజు ముందుగా షూట్ కి వస్తానంటుందట.

    Also Read: బ్రేకప్స్, డైవోర్స్ మధ్య ‘నాగచైతన్య’ ?

    ఎందుకు ఈ టాల్ బ్యూటీ ఇలా బిహేవ్ చేస్తోంది అంటే.. ఈమెకు ఆడినంత రెమ్యునరేషన్ ఇవ్వలేదు, పైగా అడిగిన స్టార్ హోటల్ ఇవ్వలేదట. దీనికితోడు సెట్ లో కూడా అందరి ఆర్టిస్ట్ లు లాగానే తనని సింపుల్ గా ట్రీట్ చేస్తున్నారట. మరి, బాలయ్య పక్కన ఉన్నప్పుడు ప్రత్యేకత ఆయనకు మాత్రమే ఇస్తాం అనే విషయాన్ని, దర్శకనిర్మాతలు ఈ బ్యూటీకి ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోవట్లేదట. బాలయ్య అయితే ఏంటి.. నేను హీరోయిన్ ! అంటుందట. ఇక ప్రగ్యలో అందం అభినయం ఇలా అన్ని ఉంటాయి.. ఇన్నాళ్లు అదృష్టమే కలిసిరాలేదు. దాంతో అవకాశాలు దూరమైపోయాయి. చివరకు బాలయ్య సినిమాకి అయిష్టంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    Also Read: ‘కేజీఎఫ్-2’ టీజర్.. ప్రపంచ రికార్డులు బద్దలు !

    కాగా ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ ఒక యంగ్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తుందట. “సర్రైనోడు” సినిమాలో క్యాథెరిన్ ని ఎమ్మెల్యేగా చూపించిన బోయపాటి, ఈ సినిమాలో ప్రగ్యని కలెక్టర్ గా చూపించబోతున్నాడు అన్నమాట. కాకపోతే బాలయ్య బాబు కలెక్టర్ తో లవ్ స్టోరీ నడపటం అంటేనే.. అభిమానులకు కూడా భయం వేస్తోంది. దీనికితోడు బాలయ్య – ప్రగ్య జోడి ఎలా ఉంటుందో కూడా తెరపైనే చూడాలి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్