
వదల బొమ్మాళి..’ అంటూ సీఎం జగన్ తన ప్రతీకార వాంఛను రగిలిస్తూనే ఉన్నాడు. తనతో పెట్టుకొని పోస్ట్ ఊస్ట్ చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి పునర్ నియామాకం అయిన ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ను చెడుగుడు ఆడేస్తున్నారు.
Also Read: జగన్‌ను మెచ్చుకున్న సోము
ఏపీలో ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నిర్ణయించి హైకోర్టుకు వెళ్లి మరీ పర్మిషన్ తెచ్చుకున్నాడు. అయితే చంద్రబాబు హయాంలో నియామకం అయిన నిమ్మగడ్డ చేసే ఆదేశాలను జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. కాలికి వేస్తే మెడకు.. మెడకు వేస్తే కాలికి వేస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా హైకోర్టు ఆదేశానుసారం ఏపీ అధికారుల బృందం ఎస్ఈసీ నిమ్మగడ్డను కలిసింది. ప్రస్తుతం కేంద్రం కరోనా వ్యాక్సిన్ ను రిలీజ్ చేసినందున దాని పంపిణీ కోసం ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమనే అభిప్రాయాన్ని ఏపీ ఉన్నతాధికారులు వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో బిజీగా ఉంటారని.. అందుకే సాధ్యం కాదని నిమ్మగడ్డకు తెలిపారు.
Also Read: బాబుపై బాలయ్య అలక..: అందుకేనా..?
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా పోలింగ్ తరహాలోనే జరపాలన్న కేంద్రం గైడ్ లైన్స్ లను నిమ్మగడ్డకు వివరించి ప్రస్తుతానికి సాధ్యం కాదని అధికారులు సెలవిచ్చారట.. కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ సాగుతోందని.. వ్యాక్సిన్ పంపిణీలో ప్రభుత్వ సిబ్బంది అంతా పాల్గొంటున్నందున ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు నిమ్మగడ్డకు వివరించారు.
దీంతో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించి ముప్పు తిప్పలు పెడుదామన్న ఎస్ఈసీ ఆశలకు గండిపడిందని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. హైకోర్టు అనుమతిచ్చినా కూడా జగన్ సర్కార్ మాత్రం నిమ్మగడ్డ చేతుల మీదుగా స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి అస్సలు సిద్ధంగా లేకపోవడం విశేషం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్