Gifts and offers for Indian Idol winner Vagdevi : ఇండియన్ ఐడల్ తెలుగు విజేతగా వాగ్దేవి నిలిచింది. పాటలతో శ్రోతలను ఉర్రూతలూగించిన ఈ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సుధీర్ఘ పాటల ప్రయాణం ముగిసింది. 17 వారాల పాటు సాగిన ఈ సింగింగ్ షోలో చివరకు వాగ్దేవి విజేతగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, హీరో రానా, హీరోయిన్ సాయిపల్లవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫైనల్ కు చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్ వేదికపై పాటలతో హోరెత్తించారు. ఇందులో చివరకు వాగ్దేవి విజేతగా నిలిచింది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి షోలో చేసిన సందడి అంతా ఇంతాకాదు.. పాటలకు హమ్ చేస్తూ.. డ్యాన్సులు చేస్తూ సింగర్స్ తో కలిసి సాన్నిహిత్యంగా కదులుతూ వారిలో జోష్ నింపిన వైనం అందరినీ ఆకట్టుకుంది.
తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా బీవీకే వాగ్దేవిని ప్రకటించి ఘనంగా ట్రోఫీ అందజేశారు చిరంజీవి. వాగ్దేవిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఇక చిరంజీవి ఆశీర్వాదం తీసుకుంది వాగ్దేవి. మెగాస్టార్ చిరంజీవి ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీగా రూ.10 లక్షలు బహుమానంగా అందజేశారు. దీంతోపాటు తన సొంత డబ్బులు రూ.6 లక్షలను అదనంగా అందించడం విశేషం.గీత ఆర్ట్స్ నుంచి రానున్న సినిమాలో పాట పాడే అవకాశం కూడా ఇచ్చారు. మొదటి రన్నరప్ శ్రీనివాస్ కు రూ.3 లక్షలు , రెండో రన్నరప్ వైష్ణవికి రూ.2 లక్షల బహుమతి లభించింది.
తెలుగు ఐడల్ తొలి విజేతకు ప్రైజ్ మనీ వర్షం కురిసింది. వాగ్దేవికి తెనాలి డబుల్ హార్స్ రూ.3 లక్షలు, చందనాబ్రదర్స్ రూ.3 లక్షలు బహూకరించారు. ఇక రన్నరప్ శ్రీనివాస్ కు సైతం తెనాలి డబుల్ హార్స్ రూ.2 లక్షలు బహూకరించారు. మరో రన్నరప్ చందనా బద్రర్స్ రూ.1 లక్షల బహుమతిగా అందించారు.
ఇక సింగర్ వైష్ణవి పాటకు ఫిదా అయిన చిరంజీవి తన రాబోయే సినిమాలో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఇక విజేత వాగ్దేవికి దాదాపు 20 లక్షల ప్రైజ్ మనీతోపాటు సినిమాల్లో పాడే అవకాశాలు వెల్లువెత్తాయి.
[…] […]