Actress Aishwarya: ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో. కెరీర్ లో 200లకు పైగా చిత్రాల్లో నటించిన ఒకప్పటి హీరోయిన్ సబ్బులు అమ్ముకొని జీవిస్తున్నారంటే ఎవరైనా నమ్మగలరా. నటి ఐశ్వర్య పరిస్థితి చూశాక నిజమని నమ్ముతారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఐశ్వర్య తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో నటించారు. 1989లో విడుదలైన ‘అడవిలో అభిమన్యుడు’ చిత్రంతో ఐశ్వర్య వెండితెరకు పరిచయమయ్యారు. హీరో జగపతిబాబుకు సోలో హీరోగా మొదటి చిత్రం.

తర్వాత ఆమె హీరోయిన్ గా పదుల సంఖ్యలో వివిధ భాషల్లో చిత్రాలు చేశారు. ఐశ్వర్య హీరోయిన్ గా నటించిన మామగారు భారీ హిట్ కొట్టింది. అలాగే మోహన్ బాబుకు జంటగా నటించిన బ్రహ్మ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న తరుణంలో ఐశ్వర్య వివాహం చేసుకున్నారు. 1994లో తన్వీర్ అహ్మద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఒక కూతురు పుట్టాక విడాకులు తీసుకొని 1996లో విడిపోయారు.
1993 తర్వాత గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య 1999లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గానే సాగింది. ఇప్పటికీ అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఐశ్వర్య ఆర్థికంగా అంత ఉన్నతంగా లేరట. ఆమె బతుకుదెరువు కోసం సబ్బులు అమ్ముతున్నట్లు తెలియజేశారు. సినిమాల్లో సంపాదించిన డబ్బులు కూతురు పెళ్లి, కుటుంబం కోసం ఖర్చు చేశాను. ఇప్పుడు సబ్బులు అమ్మడంతో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదాయం రాబడుతున్నాను. బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా అంటున్నారు ఆమె.

ఇక ఐశ్వర్య ఎవరో కాదు… సీనియర్ హీరోయిన్ లక్ష్మీ కూతురు.ఈ మధ్యకాలంలో సమంత లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓ బేబీ లో ఐశ్వర్య నటించారు . అలాగే సుశాంత్ హీరోగా విడుదలైన ఇచ్చట వాహనాలు నిలుపరాదు మూవీలో ఓ పాత్ర చేశారు. ప్రస్తుతం ఆమె ఖాతాలో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి.
Also Read:Pawan Kalyan Says No To Thaman: థమన్ కి ‘నో’ చెప్పిన పవన్ కళ్యాణ్