Pawan Kalyan Says No To Thaman: ‘అజ్ఞాతవాసి’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మూడేళ్ళ సుదీర్ఘ విరామం తీసుకొని రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘వకీల్ సాబ్’ మరియు ‘భీమ్లా నాయక్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమాలు హిట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ఉందో..ఆ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన థమన్ పాత్ర కూడా అంతే ఉంది..ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన భీమ్లా నాయక్ సినిమాలో చాలా సన్నివేశాల్లో పెద్దగా విషయం లేకపోయినప్పటికీ కూడా థమన్ సంగీతం ఆ సన్నివేశాలకు ఊపిరి పోసింది అనే చెప్పాలి..కేవలం ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని థియేటర్ లో ఎంజాయ్ చెయ్యడం కోసం ఈ సినిమాకి రిపీట్ వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు..రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ కి థమన్ ఒక అదృష్టం లాగ తగిలాడనే చెప్పాలి..కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన తదుపరి చిత్రాలకు థమన్ ని పక్కన పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Puri Jagannadh- Charmi: ఛార్మి, పూరి విడిపోనున్నారా..? పూరి కూతురే కారణం..?
ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో త్వరలోనే ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు సంయక్తంగా నిర్మిస్తున్నారు..గబ్బర్ సింగ్ లాంటి సెన్సషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండే భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి..కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ మరియు ఆయన ఇతర సినిమాల షూటింగ్స్ లో బిజీ గా ఉండడం తో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేందుకు ఆలస్యం అవుతూ వస్తుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల కాలం లో ఆయన ట్రాక్ రికార్డు సరిగా లేకపోవడం తో థమన్ ని తీసుకునేందుకు ఆలోచించాడట డైరెక్టర్ హరీష్ శంకర్..ఇదే విషయం ని పవన్ కళ్యాణ్ ముందు ఉంచగా..దేవి శ్రీ ప్రసాద్ ని తీసుకున్నాం కదా..ఆయనే ఈ సినిమా చెయ్యాలి..వేరే ఆలోచనలు ఉంటె ఇప్పుడే మానుకోండి అని చెప్పాడట పవన్ కళ్యాణ్..పవన్ కళ్యాణ్ తో గతం లో దేవిశ్రీప్రసాద్ జల్సా, గబ్బర్ సింగ్ మరియు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ మూడు సినిమాలు మ్యూజిక్ పరంగా ఎలాంటి సెన్సషనల్ హిట్స్ గా నిలిచాయి మన అందరికి తెలిసిందే..భవదీయుడు భగత్ సింగ్ సినిమా మ్యూజిక్ కూడా అదే స్థాయిలో ఉంటుందని పవన్ కళ్యాణ్ దేవిశ్రీప్రసాద్ పై గట్టి నమ్మకం ఉంచాడట..మరి ఆ నమ్మకం ని దేవి శ్రీ ప్రసాద్ ఎంత వరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.

Also Read: Dj Tillu Sequel: Dj టిల్లు సీక్వెల్ కోసం ఈ హీరో ఎలాంటి సినిమాలను మిస్ చేసుకున్నాడో తెలుసా?
[…] Also Read: Pawan Kalyan Says No To Thaman: థమన్ కి ‘నో’ చెప్పిన పవన్ … […]