lIGER: పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్షేషన్ సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ.. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. స్వతహాగా కష్టపడి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ విజయ్ హీరోగా ఓ సినిమా తరకెక్కుతోంది. ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్‌కు.. టాలీవుడ్‌కు అనన్య పాండే ఒకేసారి పరిచయం కబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం అభిమానులతో పాటు, మరో స్టార్ హీరో కూాడా ఎదురుచూస్తున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఓకే బంగారం, మహానటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడు కురుప్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించి మంచి హిట్ కొట్టాడు. మరోవైపు ఈ సినిమాతో పాటు, ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం కూడా విడుదలైంది.
ఈ క్రమంలోనే పుష్పక విమానం సినిమా సక్సెస్ కావాలని దుల్కర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ ట్వీట్‌పై స్పందించిన విజయ్.. దుల్కర్‌ను ఓ సోదరుడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, తాను లైగర్ షూటింగ్లో ఉన్నట్లు చెప్పగా.. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు దుల్కర్ తెలిపారు. ప్రస్తుతం కురుప్ సినిమా మంచి టాక్ వినిపిస్తోంది. మొదటి రోజు నుంటే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More