Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టముండని వారు ఉండరు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అండతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ హ్యాండ్సమ్ హీరో దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. నాటి నుంచి నేటి వరకు హీరోగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. అయితే తండ్రి కృష్ణ కౌభాయ్ గెటపుల్లో చేసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా బంపర్ హిట్టుకొట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత మహేష్ బాబు కూడా ఇలాంటి సినిమా చేయాలని అనుకునే వాళ్లు. దీంతో జయంత్ సి పరాన్జీ డైరెక్షన్లో ‘టక్కరి దొంగ’ అనే సినిమాతో మహేష్ బాబు మొదటి సారిగా కౌభాయ్ గా కనిపించాడు.ఈ సినిమాలో మహేష్ తో పాటు బిపాస బసు, లిసారె అనే హీరోయిన్ నటించింది. ఇటీవల లిసారెకు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ లిసారె ఇప్పుడు ఎలా ఉందంటే?
మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాల్లో సక్సెస్ కాకపోయినా ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ గుర్తండిపోతాయి. అలాగే మిల్క్ బాయ్ తో నటించిన చాలా మంది భామలు మహేష్ ను గుర్తు చేసుకుంటారు. టక్కరి దొంగ సినిమాల్లో నటించిన లిసారె ఆ సమయంలో ఎంతో అందంగా ఉండేది. బాలీవుడ్ భామ బిపాస బసును బీట్ చేస్తూ ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగు సినిమాలో నటించిన తరువాత పెద్దగా అవకాశాలు దక్కలేదు. కానీ ‘వాటర్’ సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ వివాదాస్పదంగా మారింది.
ఆ తరువాత లిసారె క్యాన్సర్ బారిన పడింది. దీంతో కీమో థెరపీ చెయించుకుంది. అయితే మరోవైపు ఈ ముద్దుగుమ్మ 2012లోనే జేసన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో వీరు ఇద్దరు అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే పిల్లలు కావాలనే ఆశ లిసారెకు బాగా ఉండేది. కానీ ఆమె క్యాన్సర్ బారిన పడడంతో సరోగసి పద్దతి ద్వారా 2018లో కవలలకు జన్మనిచ్చింది. ఆప్పటి నుంచి లిసారె సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ పోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
తాజాగా లిసారె షేర్ చేసిన ఫొటోలు చూసి నాటి యూత్ షాక్ అవుతున్నారు. ఆప్పటికీ ఇప్పటికీ ఈ భామలో ఎంతో తేడా వచ్చిందని చర్చించుకుంటున్నారు. అయితే చాలా మంది సినిమాల్లో అవకాశం రాకపోయినా వెబ్ సిరీసుల్లో నటిస్తున్నారు. దీంతో తనను వెబ్ సిరీసుల్లో నటిస్తారా? అని కొంత మంది అడుగుతున్నారు. కానీ లిసారె నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదు. అంతేకాకుండా తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, ఈ జీవితం బాగుందని అన్నారు. ఇక లిసారె లెటేస్ట్ పిక్స్ లో గ్లామర్ షో అదిరిపోయింది. ఏజ్ బార్ అయినా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని కొందరు కొనియాడుతున్నారు.
ఇక మహేష్ బాబు ప్రస్తుతం శంకర్ సినిమాకోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తన సినిమాకు సంబంధించిన లేటెస్ట్ పిక్ ను షేర్ చేశాడు. ఇందులో గుబురు గడ్డంతో గుర్తుపట్టలేని విధంగా కనిపించి ఆశ్చర్యపరిచాడు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Do you remember this heroine in mahesh babus takkari donga
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com