Homeఎంటర్టైన్మెంట్Love Today Movie: 'లవ్ టుడే' సినిమాని తెలుగు లో మిస్ చేసుకున్న యంగ్ హీరో...

Love Today Movie: ‘లవ్ టుడే’ సినిమాని తెలుగు లో మిస్ చేసుకున్న యంగ్ హీరో ఎవరో తెలుసా..!

తమిళం లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, తెలుగు లో కూడా అదే రేంజ్ హిట్ అయ్యింది.కేవలం నాలుగు కోట్ల రూపాయిల బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం, సుమారుగా 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Love Today Movie: ఇటీవల కాలం లో భారీ బడ్జెట్ సినిమాలకంటే కూడా ఎక్కువ గా తక్కువ బడ్జెట్ మరియు అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలే పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ ని కుమ్మేస్తున్నాయి. గత ఏడాది విడుదలైన సినిమాలలో అధిక శాతం ఇలాంటివే ఉండడం విశేషం. కర్ణాటక ఇండస్ట్రీ నుండి ‘కాంతారా’ సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో, తమిళం నుండి ‘లవ్ టుడే’ చిత్రం కూడా అలాంటి సెన్సేషన్ సృష్టించింది.

ఈ సినిమాలో ఒకపక్క హీరో గా చేస్తూ మరోపక్క కథ/ స్క్రీన్ ప్లే / దర్శకత్వం కూడా చేసి తనలోని అద్భుతమైన టాలెంట్ ని పరిచయం చేసాడు ప్రదీప్ రంగనాథన్. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా ఇవానా నటించింది. తొలి సినిమాతోనే ఆమె అటు తమిళ ఆడియన్స్, ఇటు తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని తొలుత రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి తెలుగు లో తీద్దాం అనుకున్నాడట ప్రముఖ నిర్మాత దిల్ రాజు. హీరో గా నిఖిల్ సిద్దార్థ్ ని తీసుకోవాలి అనుకున్నాడట. కానీ లవ్ టుడే మేకర్స్ మాత్రం రీమేక్ రైట్స్ ని అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో దిల్ రాజు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసాడు.

తమిళం లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, తెలుగు లో కూడా అదే రేంజ్ హిట్ అయ్యింది. కేవలం నాలుగు కోట్ల రూపాయిల బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం, సుమారుగా 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతే కాదు ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అలాంటి సినిమా నిఖిల్ చేసి ఉంటే ఆయన కెరీర్ లో మరో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదు అయ్యేది ఈ చిత్రం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper