spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu- Namrata: భార్య నమ్రత కోసం మహేష్ బాబు ఆ వ్యాపారంలోకి?

Mahesh Babu- Namrata: భార్య నమ్రత కోసం మహేష్ బాబు ఆ వ్యాపారంలోకి?

Mahesh Babu- Namrata: సినిమాల్లో సంపాదించింది జాగ్రత్తగా పెట్టుబడి పెడితే ఆ సినీ ప్రముఖుల వృద్ధాప్యం భావి జీవితాలు భద్రంగా ఉంటాయి. అలానే చేశారు కాబట్టే ఓ శోభన్ బాబు, మురళీ మోహన్ లు తరగని ఆస్తులతో మునిమనవలు తిన్నా తరగని సంపదను పోగేశారు. సినిమాల్లో సంపాదించింది భూములు, ఆస్తులు రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టి ఇప్పుడు సినిమాల్లో నటించకున్నా.. ఆదాయం లేకున్నా కోటీశ్వరులుగా ఉన్నారు. సంపాదించిందంతా వృథా చేసిన మహానటి సావిత్ర నుంచి నేటి కొందరు తారల వరకూ రోడ్డున పడ్డారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటుంటారు. దీన్నే ఫాలో అవుతున్నారు హీరో మహేష్ బాబు.

Mahesh Babu- Namrata
Mahesh Babu- Namrata

తనకు సినిమాలు, యాడ్స్ ద్వారా వచ్చే కోట్లను చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటారు మహేష్ బాబు.. రియల్ ఎస్టేట్(భూములు, ఆస్తులు కొనడం)తోపాటు మంచి సినిమాలు నిర్మించడం.. ఫ్యాషన్ రంగం, థియేటర్ పరిశ్రమలోకి మళ్లిస్తున్నాడు. అలా ఎప్పుడూ తన చేతికి డబ్బులు వచ్చేలా చూసుకుంటున్నాడు.

హీరోగానే కాదు.. వ్యాపారవేత్తగానూ మహేష్ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో సరికొత్త వ్యాపారాన్ని మహేష్ బాబు ప్రారంభించబోతున్నట్టు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న బిజినెస్ లతోపాటు హోటల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మహేష్ బాబు సిద్ధమైనట్టు సమాచారం. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ పేరుమీద ఈ హోటల్స్ ప్రారంభించనున్నారట.. ఈ హోటల్స్ కు ‘మినర్వా ఏఎన్’ అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయని.. అతిత్వరలోనే హోటల్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.

Mahesh Babu- Namrata
Mahesh Babu- Namrata

సంపాదనను అంతా ఇలా జాగ్రత్తగా వివిధ వ్యాపారాల్లో మళ్లిస్తూ తన భావిజీవితానికి అడుగులు వేసుకుంటున్నారు సూపర్ స్టార్. అలాగా తన వ్యాపారాల ద్వారా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పలువురు మంచి రచయితలతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper