Krithi Shetty: ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్లలో కృతి శెట్టి ఒకరు. తెలుగులో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో ఈ బేబమ్మ ఇప్పుడు సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. తెలుగులో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా సినిమాలు చేస్తూ మిగతా వారి కంటే ముందుంటోంది. కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందు ముంబైలో ఉండేది. అక్కడ చదువు కొనసాగిస్తున్న సమయంలోనే కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించింది. ఆ తరువాత ‘ఉప్పెన’తో స్టార్ నటిగా మారింది. అయతే కృతి కోసం ఆమె తల్లి ఓ త్యాగం చేసిందట.. ఆమె కెరీర్ బాగుండాలని తన జీవితంలో అన్నీ వదులుకుందట.

కర్ణాటకలోని మంగుళూరు చెందిన తుళు వంశంలో కృతి శెట్టి 2003లో జన్మించారు. ఆయన తండ్రి వ్యాపారస్తుడు. బిజినెస్ పనిమీద వీరి కుటుంబం ముంబైకి మారింది. కృతిశెట్టి ఓ వైపు చదువు సాగిస్తూనే మరోవైపు పలు యాడ్స్ ల్లో నటించింది. ఈ క్రమంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘సూపర్ 30’ అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడుకు పేరు రాలేదు.
ఆ తరువాత ‘ఉప్పెన’అవకాశం వచ్చిన తరువాత స్టార్ అయింది. ఈ సినిమా తరువాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు కూడా సక్సెస్ సాధించడంతో ఆమెతో సినిమాలు చేయడానికి కొందరు హీరోలు ఇంట్రెస్టు పెడుతున్నారు. అటు బాలీవుడ్లోనూ కృతికి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా కృతిశెట్టి కోసం ఆమె తల్లి పెద్ద త్యాగమే చేసిందట. కూతురి భవిష్యత్ కోసం తన కెరీర్ కు పులిస్టాప్ పెట్టేసిందట. కృతిశెట్టి తల్లి ఫ్యాషన్ డిజైనర్. బేబమ్మకు మంచి సినిమా అవకాశాలు రావడంతో తన తల్లి ఆమెతోనూ ఉంటోందట. తన ఫ్యాషన్ డిజైనర్ ప్రపంచాన్ని వదిలి కూతురు కోసం టైం కేటాయిస్తోందట. తన కాల్షీట్లు, తన అవసరాలు తీరుస్తూ.. తోడుగా ఉంటుందట. శృతి శెట్టికి తమ్ముడు, చెల్లి ఉన్నారు. కానీ తన తల్లి ఈమెపై ఎక్కువగా మక్కువ చూపిస్తుండడం విశేషం.