Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…నాని లాంటి స్టార్ హీరో సైతం అటు హీరోగా సినిమాలు చేస్తూనే, ఇటు ప్రొడ్యూసర్ గా మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా కోర్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత నాని వరుసగా నాలుగు విజయాలను సాధించాడు. ప్రొడ్యూసర్ గా మంచి సినిమాలను నిర్మిస్తూ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా నాని లాంటి ప్రొడ్యూసర్ తొందర్లోనే టాప్ ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడనేది మాత్రం చాలా ఖచ్చితంగా తెలూస్తోంది. ఎందుకంటే ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమా ఆయన్ని టాప్ ప్రొడ్యూసర్ గా మారుస్తుంది అంటూ ప్రతి ఒక్కరు చాలా మంచి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాతో నాని యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు నాని ప్రొడ్యూసర్ గా మారి దాదాపు 200 కోట్ల వరకు ప్రాఫిట్స్ అయితే అందుకున్నాడు.
Also Read : ఆ దర్శకుడిని నాని అంత భయపెట్టాడా? నా సినిమా సేఫ్ అంటూ, సోషల్ మీడియా పోస్ట్
ఆయన సినిమాలకి ఇప్పుడు భారీ కలెక్షన్స్ కూడా వస్తుండడం విశేషం. ఇక హీరోగా ఆయన 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతూ తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. కానీ ప్రొడ్యూసర్ గా కూడా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతు ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషమనే చెప్పాలి. నాని చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు.
అందువల్లే అటు హీరోగా, ఇటు ప్రొడ్యూసర్ గా రాణిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా డీటెయిలింగ్ గా ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టే అతనికి స్క్రిప్ట్ పట్ల చాలా నాలెడ్జ్ అయితే ఉందనే చెప్పాలి. తద్వారా ఆయన కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ప్యారడైజ్’ (Paradaise) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడానికి ఈ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read : నాని ఊర మాస్ సినిమాలు చేయడం వెనక అసలు కారణం ఇదేనా..?