Homeఎంటర్టైన్మెంట్Nani : ఆ దర్శకుడిని నాని అంత భయపెట్టాడా? నా సినిమా సేఫ్ అంటూ, సోషల్...

Nani : ఆ దర్శకుడిని నాని అంత భయపెట్టాడా? నా సినిమా సేఫ్ అంటూ, సోషల్ మీడియా పోస్ట్

Nani : హీరోలు నటులు పబ్లిక్ వేదికలపై చేసే కొన్ని కామెంట్స్.. దర్శక నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. నటుడు 30 ఇయర్స్ పృథ్వి ఓ రాజకీయ పార్టీ మీద వేసిన సెటైర్ లైలా మూవీని ఒకింత దెబ్బతీసింది. కంటెంట్ లేక లైలా ఫెయిల్ అయ్యింది. అదే సమయంలో ఓ వర్గం ఆ మూవీ మీద దుష్ప్రచారం చేయడం, పైరసీ ప్రింట్స్ వదలడం, బాయ్ కాట్ చేయడం.. డిజాస్టర్ ఓపెనింగ్స్ కి కారణమైంది. విశ్వక్ సేన్ సినిమాల్లో అత్యంత తక్కువ వసూళ్లు లైలా చిత్రానికి వచ్చాయి. పృథ్విరాజ్ వలన లైలా మూవీ నిర్మాత, దర్శకుడు, హీరో నష్టపోయారు అనేది నిజం. గతంలో కూడా పొలిటికల్ కామెంట్స్ సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.

Also Read : నాని ఊర మాస్ సినిమాలు చేయడం వెనక అసలు కారణం ఇదేనా..?

హీరో నాని పబ్లిక్ వేదికపై చేసిన కామెంట్ ఓ యువ దర్శకుడిని ఆందోళనకు గురి చేశాయి. విషయంలోకి వెళితే… నాని వాల్ పోస్టర్ మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేసి చిత్రాలు నిర్మిస్తున్నాడు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో కోర్ట్ టైటిల్ తో ఒక సోషల్ డ్రామా ఆయన తెరకెక్కించారు. చట్టాల్లో ఉన్న లోపాలు, వాటి వలన అమాయకులు, పేదలు ఎలా బలి అవుతున్నారు అనేది సినిమాలో చర్చించారు. కోర్ట్ మూవీ మార్చి 14న విడుదల కావాల్సింది. ఒకరోజు ముందే పేయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

కాగా కోర్ట్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ.. కోర్ట్ మంచి చిత్రం. మీ అందరికీ బాగా నచ్చుతుంది. మంచి కంటెంట్ తో తెరకెక్కింది. ఒకవేళ కోర్ట్ మూవీ మీకు నచ్చకపోతే.. నేను నటించిన హిట్ 3 చిత్రాన్ని చూడొద్దు అని అన్నారు. నిజానికి ఇలాంటి స్టేట్మెంట్ చాలా ప్రమాదంతో కూడుకున్నది. హిట్ 3 చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఒక చిన్న చిత్రం కోసం నాని అతిపెద్ద వాగ్దానం చేశాడు. నాని ప్రకటన దర్శకుడు శైలేష్ కొలనును తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

అయితే కోర్ట్ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. కోర్ట్ మూవీ హిట్, ఇక నా మూవీ సేఫ్. కోర్ట్ చిత్రం అందరూ చూడండి. చాలా బాగుంది. ఇక నేను హిట్ 3 ఎడిట్ రూమ్ కి వెళ్ళిపోతాను.. అని సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశాడు. ఒకవేళ కోర్ట్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆ ప్రభావం హిట్ 3 మీద పడేది. అసలే ఒక ప్లాప్ లో ఉన్న శైలేష్ కొలను కెరీర్ సందిగ్ధంగా మారేది. కోర్ట్ హిట్ అయ్యింది కాబట్టి.. హిట్ 3ని జనాలు చూస్తారని, ఆయన భావిస్తున్నారు.

Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కి చుక్కలు చూపనున్న నేచురల్ స్టార్ నాని ‘పారడైజ్’ చిత్రం?

RELATED ARTICLES

Most Popular