Directors facing backlash from fans: ప్రస్తుత మన స్టార్ హీరోలు వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో కొంతమంది దర్శకులు మాత్రం మన హీరోలకు భారీ డిజాస్టర్ లను కట్టబెడుతున్నారు. నెంబర్ వన్ పొజిషన్ కోసం తీవ్రమైన పోటీ నడుస్తున్న క్రమంలో దర్శకులు ప్లాపులను ఇవ్వడం వల్ల ఆయా హీరోల అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అలాగే దర్శకుల మీద పూర్తిగా వ్యతిరేకతను చూపిస్తున్నారు. రాజాసాబ్ సినిమా విషయంలో మారుతి మీద ప్రభాస్ అభిమానులు కక్ష్య కట్టారనే చెప్పాలి. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మారుతికి ఒక 15 రోజులపాటు నిద్ర లేకుండా చేశారు… ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో రాజాసాబ్ సినిమాతో అతని సక్సెస్ లకు మారుతి బ్రేక్ వేశాడు అంటూ మారుతీ మీద ఫైర్ అవుతున్నారు.
ఇక గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా శంకర్ మీద రామ్ చరణ్ అభిమానులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. శంకర్ కి సినిమాలు చేయడం రాదంటూ అతన్ని తీవ్రంగా విమర్శించారు… ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో కూడా హరీష్ శంకర్ మీద అలాంటి వ్యతిరేకతలే వస్తున్నాయి… జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా చేసి ప్లాప్ ను మూటగట్టుకున్నాడు.
Also Read: చిరంజీవిలో ఉన్న కామెడీని మరోసారి బయటికి తీయబోతున్న బాబీ…ఆ ఒక్క సీన్ కి అరుపులే…
దాంతో ఆ సినిమా దర్శకుడు మీద ఎన్టీఆర్ అభిమానులు కోపానికి వచ్చారు. సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తూ విపరీతమైన కామెంట్లు చేశారు… అందుకే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసేటప్పుడు మంచి కథతో సినిమాను చేసి అలాగే ప్రేక్షకుల యొక్క మెప్పు పొందితే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయా హీరోల అభిమానుల కోపానికి దర్శకులు బలైపోక తప్పదు అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం కామెంట్లు చేస్తుండటం విశేషం…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా రాని గుర్తింపు మన స్టార్ హీరోలకు ఒక్క సినిమాతో వస్తుంది. ఇక ఇలాంటి స్టార్ హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే కొంతమంది దర్శకులు వాళ్ళ సినిమాలతో వారిని వెనక్కి లాగడం సరైంది కాదనే ధోరణిలోనే అభిమానులు కూడా ఆలోచిస్తున్నారు…