Dil Raju: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా అనేది స్టార్ట్ అవ్వాలి అంటే దాంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది… రైటర్, డైరెక్టర్ హీరో, హీరోయిన్ అందరూ ఉన్నప్పటికీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలంటే అంటే దానికి ఒక ప్రొడ్యూసర్ ఉండాలి. ఒక సినిమా విషయం లో అన్ని ఉన్న కూడా ప్రొడ్యూసర్ లేకపోతే మాత్రం ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడం కష్టమే…
అయితే తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడూ.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ దిల్ రాజు బ్యానర్ లో డైరెక్టర్లుగా చేసిన వేణు శ్రీరామ్ లాంటి డైరెక్టర్లని దిల్ రాజు తనని కాదని బయట వేరే సినిమా ఏది ఒప్పుకోకుండా వాళ్లందరిని తన దగ్గరే ఉంచుకునేలా శాసిస్తున్నాడనే మాటయితే వినిపిస్తుంది. డైరెక్టర్లనే కాకుండా కొంతమంది హీరోలని కూడా దిల్ రాజు తనని కాదని సినిమాలు ఏవి చేయకూడదు అనే విధంగా వాళ్ళని భయపెడుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కంటే విపరీతంగా పెరిగిపోవడంతో ఆయన అప్పు చేసి మరి ఈ సినిమాకి డబ్బులు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పెట్టిన డబ్బును రికవరీ చేసుకోవడానికి చిన్న, మీడియం డైరెక్టర్లను గాని, హీరోలను గాని తన దగ్గరే ఉంచుకొని వాళ్ల చేత సినిమాలు చేయించుకుంటూ బిజినెస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలు, డైరక్టర్లు గాని తనకు తెలియకుండా బయట ఏ ప్రాజెక్టు ఒప్పుకోకూడదనే కొన్ని కండిషన్ లు పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే వేణు శ్రీరామ్ లాంటి డైరెక్టర్ దిల్ రాజు బ్యానర్ లో మూడు సినిమాలు చేసేసి ఉన్నాడు. కాబట్టి ఆయనకి దిల్ రాజు తప్ప బయట వేరే ప్రొడ్యూసర్ సినిమా ఇచ్చే అవకాశం లేదు అన్న డౌట్ లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన దిల్ రాజు తోనే ఉంటూ దిల్ రాజు చెప్పినట్టుగానే సినిమాలు చేస్తున్నాడు. ఇక అలాగే బలగం సినిమాతో మంచి హిట్ అందుకున్న వేణు లాంటి డైరెక్టర్ కూడా దిల్ రాజు చెప్పినట్టుగానే చేస్తూ ఆయన ప్రొడక్షన్ లోనే తన రెండో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దిల్ రాజు సినిమాలను జడ్జిమెంట్ చేయడమే కాకుండా ఆ సినిమాలకి బిజినెస్ ఎలా చేయాలో కూడా చాలా బాగా తెలిసిన వ్యక్తిగా ఇండస్ట్రీలో దిల్ రాజు ని అభివర్ణిస్తారు…