Dhurandhar 2 Box Office Collection: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చిన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రం , ఎలాంటి సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం నెల రోజుల్లో సాధించిన వసూళ్లను, ‘ధురంధర్ 2’ అనేక ప్రాంతాల్లో 8 రోజుల్లోనే సాధించింది. ‘ధురంధర్’ చిత్రానికి క్లోజింగ్ లో 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ‘ధురంధర్ 2’ చిత్రానికి కేవలం 8 రోజుల్లో 1088 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇదొక హిస్టారికల్ రికార్డు గా పరిగణించొచ్చు. ఈ వీకెండ్ తో ఈ చిత్రం ‘ధురంధర్’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని కూడా దాటేయబోతుంది. అంతే కాకుండా 8 ఏళ్ళ నుండి చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ‘బాహుబలి 2’ నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ గ్రాస్ ని కూడా ఈ చిత్రం ఈ వీకెండ్ లో దాటేయబోతుంది.
Also Read: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ముహూర్తం ఫిక్స్ చేసిన కవిత
రోజువారీగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం రాబట్టిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే ప్రీమియర్ షోస్ + మొదటి రోజుకి కలిపి 140 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , రెండవ రోజున 81 కోట్లు, మూడవ రోజున 109 కోట్లు, నాల్గవ రోజున 113 కోట్లు, 5 వ రోజున 59 కోట్లు, 6వ రోజున 53 కోట్లు, 7 వ రోజున 45 కోట్లు, 8వ 49 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద 8 రోజుల్లో 649 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కేవలం హిందీ వెర్షన్ నుండి వచ్చాయి. అంతే కాకుండా ఫాస్టెస్ట్ 300,400,500,600 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఏకైక ఇండియన్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా అప్పుడే ‘ధురంధర్’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేసింది.
అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రం ఇప్పటి వరకు ఓవర్సీస్ నుండి 30 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే 280 కోట్ల రూపాయిలు అన్నమాట. ఓవరాల్ గా నెట్ పరంగా కాకుండా గ్రాస్ పరంగా చూస్తే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి 1088 కోట్ల రూపాయిల గ్రోస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ ని రాబడుతుందో లేదో చూడాలి. నేడు శ్రీ రామ నవమి కావడంతో ఈ చిత్రానికి నిన్నటి కంటే ఈరోజు ఎక్కుఇవా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ ముగిసే సమయానికి ఈ సినిమా గ్రాస్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.