Homeఎంటర్టైన్మెంట్Venkatesh Anil Ravipudi New Movie: వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టార్రర్ కి టైటిల్ ని...

Venkatesh Anil Ravipudi New Movie: వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టార్రర్ కి టైటిల్ ని లాక్ చేసిన అనిల్ రావిపూడి.. చాలా వెరైటీ గా ఉందిగా..

Venkatesh Anil Ravipudi New Movie: వెంకటేష్(Victory Venkatesh) , అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో ఇప్పటి వరకు విడుదలైన నాలుగు సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో 5 వ సినిమా రాబోతుంది. ఈ చిత్రం లో నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. రీసెంట్ గానే అనిల్ రావిపూడి హీరోయిన్స్ ని కూడా సెట్ చేసాడు. వెంకటేష్ కి […]

Venkatesh Anil Ravipudi New Movie: వెంకటేష్(Victory Venkatesh) , అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో ఇప్పటి వరకు విడుదలైన నాలుగు సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో 5 వ సినిమా రాబోతుంది. ఈ చిత్రం లో నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. రీసెంట్ గానే అనిల్ రావిపూడి హీరోయిన్స్ ని కూడా సెట్ చేసాడు. వెంకటేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించగా , కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టి నటించింది. అయితే నేడు శ్రీ రామనవమి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్నీ పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ ని దాదాపుగా పూర్తి చేశారట. అంతే కూడా టైటిల్ కూడా లాక్ అయ్యినట్టు తెలుస్తోంది. ఉగాదికే ప్రకటిద్దామని అనుకున్నారట కానీ, స్క్రిప్ట్ పూర్తి కాకపోవడం తో ఆగారట.

Also Read: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ముహూర్తం ఫిక్స్‌ చేసిన కవిత

అనిల్ రావిపూడి సినిమాల టైటిల్స్ చాలా విచిత్రం గా ఉంటాయి. ఈసారి కూడా అలాంటి కూడా అలాంటి టైటిల్ నే ఫిక్స్ చేసినట్టు సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అదిరిపోద్ది సంక్రాంతి’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ఒక వీడియో ద్వారా ప్రకటించబోతున్నారట. అంతే కాకుండా పూజా కార్యక్రమాలు కూడా వచ్చే నెలలోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు గతం లో అనిల్ రావిపూడి తో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు ‘, ‘భగవంత్ కేసరి’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా, జీ స్టూడియోస్ సంస్థ కూడా ఈ చిత్ర నిర్మాణం లో భాగం కానుంది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే , తన బావమరిది (కళ్యాణ్ రామ్ ) దూకుడు కారణంగా వెంకటేష్ కి ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇదంతా పక్కన పెడితే , ఒక్క విషయాన్నీ బాగా గమనించాలి , ఇప్పటి వరకు అనిల్ రావిపూడి వెంకటేష్ తో 4 సినిమాలు చేస్తే, అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం మాత్రమే సోలో సినిమాగా చెప్పుకోవచ్చు. మిగిలిన సినిమాలన్నీ మల్టీ స్టార్రర్ సినెమాలుగానే తెరకెక్కాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో అయితే కేవలం స్పెషల్ రోల్ లో మాత్రమే కనిపించాడు. ఈసారన్నా సోలో సినిమా తీస్తాడని అనుకుంటే, ఇప్పుడు కూడా మల్టీ స్టార్రర్ చిత్రమే చేస్తున్నాడు. మరి ఫలితం పరంగా గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన మ్యాజిక్ ని రీ క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper