Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Ram Charan Birthday Surprise: మరోసారి గొప్పమనసు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్...

Chiranjeevi Ram Charan Birthday Surprise: మరోసారి గొప్పమనసు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ పుట్టినరోజు కి స్పెషల్ సర్ప్రైజ్..

Chiranjeevi Ram Charan Birthday Surprise: మన టాలీవుడ్ హీరోల్లో సంపాదించిన డబ్బుతో ఎంతో కొంత సమాజానికి ఇచ్చేయాలి అనే గొప్ప మనస్సు ఉన్న నటుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో వేలమందికి రక్త దానాలు, నేత్ర దానాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి , ప్రజాసేవ చేసుకోవడం కోసం రాజకీయాల్లోకి రావడం, అక్కడ ఉండే కుళ్ళు కుతంత్రాలను భరించలేక, రాజకీయాల నుండి బయటకు వచ్చి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టడం వంటివి చేసాడు. సేవ చేయడానికి రాజకీయాలే అవసరం లేదు, మంచి మనస్సు ఉంటే చాలు అని నమ్మే చిరంజీవి, ఇప్పటికీ సమయం సందర్భం దొరికినప్పుడల్లా సేవలు చేస్తూనే ఉన్నాడు. కరోనా లాక్ డౌన్ సమయం లో సినీ కార్మికులను ఆదుకోవడం లో కానీ, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆక్సిజెన్ సీలిండర్లు అందించడంలో మెగాస్టార్ చిరంజీవి చూపించిన అంకిత భావం అద్భుతం.

ఇకపోతే రీసెంట్ గానే తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ అవార్డ్స్’ వేడుకను ఎంతో గ్రాండ్ గా నిర్వహించి , చిరంజీవి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తో సత్కరించారు. అయితే నేడు తన తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, ఎన్టీఆర్ అవార్డు తో పాటూ, వచ్చిన 10 లక్షల ప్రైజ్ మనీని , 5 స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించాడు చిరంజీవి. గతం లో రామ్ చరణ్ ని కలవాలని కోరుకున్న 30 మంది వృద్ధులను చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ కి పిలిపించి స్వయంగా తన చేతులతో అన్నదానం చేయించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. డబ్బులు, ప్రైజ్ మనీ వంటివి అందరి హీరోలకు వస్తాయి, కానీ తమకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత పంచి పెట్టే గుణాన్ని దేవుడు కేవలం కొంతమందికి మాత్రమే ఇస్తారు. ఆ కొంతమందిలో ఒకరే మెగాస్టార్ చిరంజీవి.

ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో భారీ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న చిరంజీవి, త్వరలోనే డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేయబోతున్నాడు. జనవరి నెలాఖరులోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కావాల్సి ఉంది కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా, అదే విధంగా సుకుమార్ శిష్యుడైన వెంకట్ తో మరో సినిమా చేయనున్నాడు. అన్ని అనుకున్నట్టు జరిగి ఉండుంటే వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మరో పక్క చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం ఆగస్టు నెలలో విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular