Homeఎంటర్టైన్మెంట్Devi Sri Prasad Birthday Special: వీడేం మ్యూజిక్ కొడతాడు ? అనుకుంటే, మెగాస్టార్...

Devi Sri Prasad Birthday Special: వీడేం మ్యూజిక్ కొడతాడు ? అనుకుంటే, మెగాస్టార్ నే ఉర్రూతలూగించాడు !

Devi Sri Prasad Birthday Special: చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో అడుగుపెట్టి ఎన్నో మధురమైన గీతాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు దేవి శ్రీ ప్రసాద్. 19 ఏళ్ల వయసులో సంగీత దర్శకుడిగా దేవి ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ చిన్న చూపు చూశారు. ‘కుర్రాడు.. వీడేం మ్యూజిక్ కొడతాడు ?’ అంటూ హేళన కూడా చేశారు. కానీ.. ఆ తర్వాత దేవి సినిమా పాటలు రిలీజ్ అయ్యాక.. ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. ‘ఏమిటి 19 ఏళ్ల కుర్రాడు ఈ సాంగ్స్ ఇచ్చాడా ? ఎవరు ఆ కుర్రాడు ?’ అంటూ దేవి శ్రీ ప్రసాద్ గురించి ఆ రోజుల్లో పెద్ద చర్చే జరిగింది.

Devi Sri Prasad Birthday Special
Devi Sri Prasad

ఆ రేంజ్ లో దేవి సినిమా పాటలు క్లాసిక్ గా నిలిచిపోయాయి. సంగీతానికి వయసు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం అని నిరూపించి 19 ఏళ్ల వయసులోనే సంగీత ప్రపంచం లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించాడు దేవి శ్రీ ప్రసాద్. నిజంగానే దేవి సంగీతం ఉత్తేజాన్ని కలిగిస్తోంది, దేవి స్వరం ‘ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. దేవి సంగీతంలో ఎంత ఖచ్చితత్వం ఉంటుందో.. బయట దేవి శ్రీ ప్రసాద్ అంత సరదాగా ఉంటాడు. ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

దాదాపు 100 సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు దేవి. అలాగే 60 పాటలు వరకు పాడాడు. మెలోడీ సాంగ్స్ తో పాటు ఎగిరి స్టెప్పులు వేసే మాస్ బీట్ కొట్టడంలోనూ ఈ రాక్‌ స్టార్‌ కు ఎవరూ సాటి రారు. తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసే దేవి నిజానికి ఒక మ్యూజిషన్ అయినా, అతనో ఒక మేజిషన్. అంతలా తన పాటతో మాయ చేస్తాడు. 1979 ఆగస్టు 2న సత్యమూర్తి, శిరోమణి దంపతులకి జన్మించాడు దేవి శ్రీ ప్రసాద్. చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి చూపిస్తుండటంతో మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్పించారు.

ఆ తర్వాత ఇండస్ట్రీలో మణిశర్మ దగ్గర శిష్యరికం చేశారు. అయితే, ముందుగా దేవిలో టాలెంట్ ఉందని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి దర్శకుడు కోడి రామకృష్ణ. తన ‘దేవి’ సినిమాలో శ్రీ ప్రసాద్ కి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి అతన్ని ‘దేవి శ్రీ ప్రసాద్’ను చేశారు. ఆ సినిమా తర్వాత దేవికి ‘ఆనందం’ సినిమాతో భారీ బ్రేక్ వచ్చింది. రాక్ స్టార్ అయిపోయాడు.

ఆ తర్వాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలకి గాను దేవికి ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు లభించాయి. పవర్ స్టార్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకి నంది అవార్డు లభించింది. దేవిలో గేయ రచయితగా కూడా ఉన్నాడు. అయితే, ఐటమ్ సాంగ్ లకి దేవి స్పెషలిస్ట్. ఇక ఇన్ని సినిమాల్లో వందల పాటల్లో దేవికి ‘నాన్నకు ప్రేమతో’ పాట అంటే చాలా ప్రత్యేకం. తన తండ్రి పై ఉన్న ప్రేమతో నాన్నకు ప్రేమతో పాటను రాసి తానే స్వయంగా పాడారు. మా ఓకే తెలుగు తరుపున ఈ మల్టీ టాలెంటెడ్ రాక్ స్టార్ కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతకీ దేవి శ్రీ ప్రసాద్ పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది ?, కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper