Dacoit movie minus points: అడివి శేషు హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన ‘డెకాయిట్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే యావరేజ్ టాక్ ను దక్కించుకుంది. నిజానికి ఈ సినిమా ఒక లవ్ స్టోరీ గా తెరకెక్కింది. అడవి శేషు థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు. కాబట్టి ఆయన నుంచి అలాంటి సినిమా వస్తుందని చాలామంది ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ డెకాయిట్ సినిమా మాత్రం దానికి పూర్తి భిన్నంగా తెరకెక్కింది. ఇదొక లవ్ స్టోరీ కావడంతో అడవి శేషు తన పూర్తిస్థాయి నటన ను ఇందులో చూపించలేకపోయాడని చాలామంది చెబుతున్నారు.
ఇక దానికి తోడుగా అడవి శేషు క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంతకుముందు ఆయన చేసిన థ్రిల్లర్ సినిమాల్లో ఆయన చాలా వేరియేషన్స్ ను చూపించాడు. కానీ ఇందులో మాత్రం చాలా ఫ్లాట్ యాక్టింగ్ చేశాడు. అడవి శేషు అభిమానులు అతని సినిమాలో ఏ ఎలిమెంట్స్ అయితే ఉండాలని కోరుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ ఇందులో మిస్ అయ్యాయని అందువల్లే ప్రేక్షకులు తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు అంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా అడవి శేషు లాంటి నటుడు నుంచి రావాల్సిన సినిమా ఇది కాదని మరి కొంతమంది చెబుతున్నారు. 2020 కరోనా సమయంలోనే ఈ సినిమాని స్టార్ట్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది. మొత్తానికైతే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవ్వడం అనేది మంచి విషయమే కానీ అప్పటికి ఇప్పటికీ ఆ సినిమాలో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి…
ఇలా ఒక సినిమా రిలీజ్ లేట్ అవుతుండటం వల్ల సినిమాలోని కంటెంట్ డైల్యూట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి… ఇక మొత్తానికైతే అడవి శేషు చాలా రోజుల తర్వాత డెకాయిట్ సినిమాతో వచ్చినప్పటికి అతను ఆవరేజ్ సక్సెస్ మాత్రమే మూట గట్టుకున్నాడు…