https://oktelugu.com/

Court : ‘కోర్ట్’ 10 రోజుల వసూళ్లు..10 లక్షల టికెట్స్ కి ఇంత గ్రాస్ వచ్చిందా!

Court : చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ని ఉతికి ఆరేస్తున్న 'కోర్ట్' చిత్రం(Court Movie) అప్పుడే 10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ పది రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన స్టడీ కలెక్షన్స్ ని చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి వచ్చింది.

Written By: , Updated On : March 24, 2025 / 05:00 PM IST
Court

Court

Follow us on

Court : చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ని ఉతికి ఆరేస్తున్న ‘కోర్ట్’ చిత్రం(Court Movie) అప్పుడే 10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ పది రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన స్టడీ కలెక్షన్స్ ని చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి వచ్చింది. ఒక కోర్ట్ రూమ్ డ్రామా కి స్టార్స్ తో అవసరం లేకుండా ఈ స్థాయి వసూళ్లు రావడమంటే మన తెలుగు ఆడియన్స్ మంచి సినిమాలను ఎలా అక్కున చేర్చుకుంటారో చెప్పడానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ఇది వరకు నిర్మాతగా వ్యవహరించిన సినిమాలన్నీ కమర్షియల్ గా సూపర్ హిట్స్ అయ్యాయి కానీ, ‘కోర్ట్’ చిత్రానికి వచ్చినంత లాభాలు ఆయన కెరీర్ లో ఏ సినిమాకు కూడా రాలేదట. ఇది కూడా ఆయన కెరీర్ లో ఒక సంచలన రికార్డుగా చెప్పుకోవచ్చు.

Also Read : ‘కోర్ట్’ 9 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ ప్రాంతంలో బాగా తగ్గిందిగా!

ఇదంతా పక్కన పెడితే బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోయిన టికెట్స్ దాదాపుగా 10 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రానికి సగటున 60 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయేవి. ఇంత క్రమంగా ఒక సినిమాకు టికెట్స్ అమ్ముడుపోవడం ఈమధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలకు కూడా జరగలేదు. శనివారం రోజున అద్భుతమైన గ్రోత్ ని దక్కించుకున్న ఈ చిత్రానికి, ఆదివారం రోజున ఇంకా ఎక్కువ వసూళ్లు వస్తాయని అని అనుకున్నారు. కానీ నిన్న రెండు IPL మ్యాచులు జరగడం వల్ల దాని ప్రభావం కలెక్షన్స్ పై పడింది. ఫలితంగా 10వ తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా, కేవలం కోటి 50 లక్షల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా నిన్న కోటి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందట.

ఓవరాల్ గా పది రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూస్తే 10 రోజుల్లో ఈ చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 46 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఒక చిన్న బడ్జెట్ సినిమాకు ఇంత వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. అంటే కాదు ఈ ఏడాది వరుసగా పది రోజులు నాన్ స్టాప్ గా తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ ని రాబట్టిన సినిమాలలో ఒకటిగా ఈ చిత్రం నిల్చింది. ఈ వారం లో ఈ చిత్రం చిన్న సినిమాలకు ప్రతిష్టాత్మకంగా భావించే 30 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read : ‘కోర్ట్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ ప్రాంతం నుండి 20 కోట్లు!