Homeఎంటర్టైన్మెంట్Allu Arjun charity : గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. తండ్రిని కోల్పోయిన దివ్యారంగురాలికి...

Allu Arjun charity : గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. తండ్రిని కోల్పోయిన దివ్యారంగురాలికి ఏమి చేశాడో మీరే చూడండి!

Allu Arjun charity : గత నెల 28 న కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా పేలుళ్ల ఘటన లో ఎంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో, ఎంత మంది చిన్నారు ఆనాధలు అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేషనల్ లెవెల్ లో సెన్సేషనల్ టాపిక్ గా మారిన సంఘటన ఇది. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా మృతుల కుటుంబాలను సందర్శించి వాళ్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడమే కాకుండా, ఆర్ధిక సాయం కూడా ప్రభుత్వం తరుపున అందించారు. అయితే ఈ పేలుళ్లలో పైడిపల్లి దుర్గ అనే అమ్మాయి పరిస్థితి రీసెంట్ గా సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల్లోకి వెళ్తే దుర్గ ఒక మానసిక వికారంగురాలు. ఈమెని తండ్రి కంటికి రెప్పలాగా చూసుకునే వాడు. ఈ పేలుళ్లలో ఆయన చనిపోవడం తో దుర్గ పరిసితి అత్యంత దయనీయంగా మారింది.

తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. ఆమెకు మతి స్థిమితం సరిగా లేకపోవడం నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడిగే పరిస్థితి కూడా లేదు. ఈమె దయనీయమైన పరిస్థితి సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం తో అది అల్లు అర్జున్ వరకు చేరింది. దీంతో ఆయన వెంటనే స్పందించి , బన్నీ వాసు చేత అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతి నిధులను శనివారం రోజున వేట్లపాలెం పంపించి దుర్గ వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు జీవితాంతం నెలకు 7500 రూపాయిలు ప్రతీ నెల ఆర్ధిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు ఫ్యాన్స్ అస్సోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ సోమవారం రోజున మీడియా కి తెలిపారు. సినీ ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ , కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఈ విషయాన్ని గుర్తించి ఆమెకు సాయం అందించడాన్ని చూస్తుంటే ఆయన మనసు ఎంత గొప్పదో అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రీసెంట్ గానే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మరియు ఆమె కూతురి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసి వెంటనే స్పందించి , వాళ్లకు నెలకు పది వేల రూపాయిల ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకొచ్చిన అల్లు అర్జున్ , ఇప్పుడు మరోసారి ఇలాంటి పని చేయడానికి ముందుకు రావడాన్ని చూస్తుంటే, రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఇలాంటి మంచి పనులు చాలానే చెయ్యబోతున్నాడు అనేది తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రతీ జిల్లాకు ఫ్యాన్స్ అస్సోసియేషన్ ని ఏర్పాటు చేసి, వాళ్ళతో మీటింగ్స్ పెడుతుంటే సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు తన సొంత బ్రాండింగ్ కోసం అల్లు అర్జున్ చూడండి ఎంత ఖర్చు చేస్తున్నాడో అంటూ మండిపడ్డారు. కానీ ఇప్పుడు ఆ అస్సోసియేషన్స్ ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తుంటే , అందరికీ ఆయన మీద ఒక క్లారిటీ వచ్చింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version