Court Movie Collections
Court Movie Collections: ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద కమర్షియల్ హిట్స్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘కోర్ట్'(Court Movie). ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో హర్ష రోషన్(Harsh Roshan), శ్రీదేవి హీరో హీరోయిన్లు గా నటించగా, నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించాడు. నాని ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ కోర్టు చిత్రానికి వచ్చిన లాభాలతో ఆయన మరో నాలుగు కోర్ట్ లాంటి సినిమాలను తీయొచ్చు. కొడితే కుంభస్థలం బద్దలైంది అని అంటుంటారు కదా, ఆ కుంభస్థలాన్నే బద్దలు కొట్టాడు నాని. నిన్నగాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో ఈ చిత్రం ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు చూద్దాము. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 7 కోట్ల రూపాయలకు జరిగింది.
రెండవ రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం మొదటి వారం లోనే 12 కోట్ల రూపాయలకు పైగా లాభాలను రాబట్టిందట. 7 వ రోజు ఈ చిత్రానికి కోటి 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 7 రోజులకు కలిపి 37 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ప్రాంతాల వారీగా చూస్తే ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ సినిమాకు 7 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. కచ్చితంగా ఫుల్ రన్ లో ఈ ఒక్క ప్రాంతం నుండే 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. అదే విధంగా సీడెడ్ లో ఈ చిత్రానికి 97 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే సీడెడ్ ప్రాంతం కాస్త తగ్గింది కానీ, ఓవరాల్ క్లోజింగ్ లో మాత్రం డీసెంట్ స్థాయిలో వసూళ్లనే రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి 5 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 13 కోట్ల 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఓవర్సీస్ లో 4 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ లో మరో పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టే అవకాశాలు ఉన్నాయి.