Baby Naming Business In America: అల వైకుంఠపురం సినిమా చూశారా. అందులో మురళీ శర్మ తన కుమారుడికి బంటు అని పేరు పెడతాడు. ఇది విన్న పూజారి ఇది పేరా.. ఇదే పేరా అని ప్రశ్నిస్తాడు. దానికి మురళి శర్మ అవును ఇదే పేరు అంటాడు. అక్కడ పేరు గురించి అంతలా చర్చ జరిగిందంటే.. పేరుకు ఉన్న విలువ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?
సాధారణంగా ఒక మనిషి గుర్తింపు అనేది అతని పేరు ద్వారా తెలుస్తుంది. ఒకప్పుడు అంటే పేర్లకు అంతగా విలువ నిచ్చేవారు కాదు. పైగా మూస ధోరణిలో పేర్లను పెట్టేవారు. అప్పటి రోజుల్లో చదువుకునేవారు అంతగలేరు కాబట్టి.. పేర్ల విషయంలో ట్రెండీ విధానం కొనసాగేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటున్నారు. పేర్ల విషయంలో అయితే మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. పుట్టిన తేదీ.. జన్మ నక్షత్రం.. రాశి.. ఇతర గమనాల ఆధారంగా పేర్లను పెడుతున్నారు. మనదేశంలో అంటే జ్యోతిషం ఆధారంగా పేర్లను పెడుతుంటారు. కానీ, విదేశాలలో అలా కాదు.
విదేశీయులకు ఒక విధానాలు ఉంటాయి. వాటి ఆధారంగానే తమ పిల్లల పేర్లు పెడుతుంటారు. అయితే అక్కడ పేర్లు పెట్టే విధానం ఇప్పుడు ఒక బిజినెస్ లాగా మారిపోయింది. ముఖ్యంగా ఓ యువతి పేర్లను పెట్టడాన్ని ఒక వ్యాపారం లాగా మార్చుకుంది. అమెరికాకు చెందిన ఓ యువతి పిల్లలకు పేర్లు పెట్టే తీరులో సరికొత్త ట్రెండు సృష్టిస్తుంది. దీనికోసం ఏకంగా ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసింది. బాబు లేదా పాపకు పేరు పెడితే 27 లక్షల వరకు చార్జ్ చేస్తోంది. ఇప్పటివరకు ఆమె 500 మంది పిల్లలకు పేర్లను పెట్టింది. ఈ ప్రకారం ఆమె ఏ స్థాయిలో సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈమె పేర్లను పెట్టే క్రమంలో ఇంగ్లీష్ పురాణాలను.. ఇతర చారిత్రక ఆధారాలను స్టడీ చేస్తూ ఉంటుంది. అందులో పాత్రలు.. వాటి ఔచిత్యం గుర్తిస్తుంది. ఆమె నిత్యం పుస్తకాలు చదవడం.. ఇతర స్టోరీలను తెలుసుకోవడం చేస్తుంది.
ఆమె పెట్టే పేర్లలో ట్రెండీ విధానం మాత్రమే కాకుండా ఇంగ్లీష్ కల్చర్ కనిపిస్తుంది. పైగా ఇంగ్లీష్ దేశాలలో క్రైస్తవ మతం వ్యాప్తిలో ఉంటుంది. క్రైస్తవ మతంలో ఉన్న పేరు పొందిన పాత్రల పేర్లకు నేటి ట్రెండి విధానాన్ని అనుసంధానిస్తుంది. తద్వారా కొత్త పేరును సృష్టిస్తుంది. అందువల్లే ఈ యువతికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఆమె ద్వారా పేర్లు పెట్టించుకోవాలని.. ఎంతమంది శ్రీమంతులు తాపత్రయ పడుతున్నారు. ఆమె ఒక పేరు పెడితే దాదాపు 27 లక్షల వరకు చార్జ్ చేస్తూ ఉంటుంది. మొదట్లో సరదాగా చేసిన ఈ పనిని ఆమె ఇప్పుడు ప్రొఫెషనల్ గా మార్చుకుంది. ఏకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 500 మంది పిల్లలకు పేర్లు పెట్టిన ఆమె.. పేరు పెట్టినందుకు గాను ఒక్కో క్లయింట్ నుంచి 27 లక్షల వరకు వసూలు చేసింది.