Homeక్రీడలుక్రికెట్‌Team India T20 World Cup Celebration: షాంపెయిన్ నుంచి హనుమాన్ దాకా.... టీమిండియా గెలుపు...

Team India T20 World Cup Celebration: షాంపెయిన్ నుంచి హనుమాన్ దాకా…. టీమిండియా గెలుపు సంబరాలు ఓ స్ఫూర్తి

Team India T20 World Cup Celebration: భారత దేశాన్ని బ్రటిష్‌వాళ్లు సుమారు 200 ఏళ్లు పాలించారు. మన దేశంలో మనల్ని బానిసలుగా చూశారు. మన అలవాట్లను మాన్పించి బ్రటిష్‌ అలవాట్లు నేర్పాటు. ఆదివారం సెలవు. టీ, కాఫీలు ఇంకా అనేక అలవాట్లు వారి నుంచి వచ్చినవే. ఇక ఆటల్లో కూడా మనవాళ్లు బ్రిటిష్‌ సెలబ్రేషన్స్‌ను ఫాలో అవుతున్నారు. ఏదైనా ట్రోఫీ గెలవగానే ఒక షాంపెయిన్‌ బాటిల్‌ ఓపెన్‌ చేసి.. దానిని అందరిపై చల్లుతూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత భారత జట్టు అలా చేయలేదు. ఈ గెలుపు సంబరాల్లో బ్రిటిష్‌ కాల సాంప్రదాయాలను పక్కనపెట్టి దేశీయ సంస్కృతి వైపు మలుపు తిప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌ తర్వాత జట్టు సభ్యులు మొదట హనుమాన్‌ మందిరంలో పూజలు చేశారు.

Also Read: ‘మూసీ’ రాజకీయం.. కంపు కొడుతోంది పో!

సాంస్కృతిక మలుపు..
చారిత్రకంగా విజయాల్లో షాంపెయిన్‌ పూరణాలు చేసే అలవాటును వదిలి జట్టు అహ్మదాబాద్‌ ప్రాచీన హనుమాన్‌ మందిరానికి చేరుకుంది. ట్రోఫీని దైవ సన్నిధిలో ఉంచి విశేష పూజలు చేశారు. సూర్యకుమార్‌తోపాటు జట్టులోని కీలక ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. తర్వాత హోటల్‌కు వచ్చి సంబురాలు చేసుకున్నారు. ఇది భారతీయత్వ పునరుద్ధరణను సూచిస్తుంది.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఉత్సవాలు
భారత్‌ గెలుపును భారత్‌ వెలుపల బంగ్లాదేశ్‌ మరింత ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది. తాలిబాన్‌ పాలన ఉన్నప్పటికీ ప్రజలు రోడ్లపైకి దిగి రాత్రి నృత్యాలు చేశారు. సంగీతం వాయించారు. ఎలాంటి భయం లేకుండా భారత గెలుపును సెలబ్రేట్‌ చేయడం క్రికెట్‌ అంతర్జాతీయ ఐక్యతకు ఉదాహరణ. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

బ్రిటిష్‌ 200 సంవత్సరాల పాలనలో వచ్చిన పాశ్చాత్య సంప్రదాయాల నుంచి హనుమాన్‌ ఆరాధన వైపు మార్పు యువతకు స్వదేశీ విలువలను పెంపొందిస్తుంది. ఆఫ్ఘన్‌ సెలబ్రేషన్లు రాజకీయాలకు అతీతంగా క్రీడ భావోద్వేగాలను చూపిస్తాయి. ఈ ట్రెండ్‌ భవిష్యత్‌ విజయాల్లో కూడా కొనసాగవచ్చు. ఫలితంగా క్రికెట్‌ దేశ గుర్తింపును మరింత బలపరుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version