Homeఎంటర్టైన్మెంట్Shivaji hero comments : 'పేటీఎం' బ్యాచ్ అంటూ రెచ్చిపోయిన హీరో శివాజీ..వీడియో వైరల్!

Shivaji hero comments : ‘పేటీఎం’ బ్యాచ్ అంటూ రెచ్చిపోయిన హీరో శివాజీ..వీడియో వైరల్!

Shivaji hero comments : ప్రముఖ సీనియర్ హీరో శివాజీ ఈమధ్య కాలంలో సోషల్ చేస్తున్న కొన్ని కామెంట్స్ పెద్ద చర్చలకు దారి తీస్తోంది. ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ దగ్గర నుండి మొదలైన ఈ రచ్చ , ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గానే ఆయన ఒక వీడియో లో దుబాయ్ కంటే ఇప్పుడు అమరావతి నే తోపు అంటూ ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అదే ఇంటర్వ్యూ లో ఆయన తన సినిమా పై నెగటివ్ కామెంట్స్ చేసిన వాళ్లపై కూడా కామెంట్స్ చేశాడు. ఆయన లేటెస్ట్ చిత్రం ‘సాంప్రదాయినీ ..సుప్పిని.. సుద్దపూసని ‘ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఇది కూడా ఒకటి. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.

ఆయన మాట్లాడుతూ ‘నా సినిమాలు విడుదల కాకముందే కొంతమంది పనిగట్టుకొని నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. వీళ్లది ఒక పెద్ద మాఫియా , వాళ్లకు పోటీ గా ఒక సినిమా విడుదలకు ఉంటే తొక్కేయడానికి రెడీ గా ఉంటారు. పేటీఎం బ్యాచ్ అంటారు వీళ్ళని. అంటే డబ్బులు తీసుకొని నెగెటివ్ ట్వీట్స్ వేసే వాళ్ళు. సోషల్ మీడియా లో పట్టుమని వంద సబ్ స్క్రైబర్లు కూడా లేని వాళ్ళు ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవడం నాకు నిమిషం పని. కానీ అంత సమయం కేటాయించే స్థాయి వాళ్లకు లేదు. అరేయ్ పేటీఎం బ్యాచ్.. నన్ను తగులుకుంటే అది మీకే ప్రమాదకరం’ అంటూ చెప్పుకొచ్చాడు. చివర్లో ఆయన చెప్పిన డైలాగ్ ‘నన్ను తగులుకుంటే మీకే ప్రమాదం ‘ అనేది రీసెంట్ గా అన్వేష్ కి జరిగిన రివర్స్ ఎటాక్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని అంటున్నారు విశ్లేషకులు. ఇంకా ఆయన ఏమేమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో పూర్తిగా చూడండి.

🤣🎬 Actor Sivaji Time Starts Now.. !!🔥 | Sivaji Life Story | Sivaji Anasuya War🔥 | Telugu Interviews

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version