Court Collection
Court Collection: చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి తరహా వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘కోర్ట్'(Court Movie). ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హర్ష రోషన్(Harsh Roshan), శ్రీదేవి(Sridevi) హీరోహీరోయిన్లు గా నటించారు. వీళ్లిద్దరి మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ ని అద్భుతమైన కోర్ట్ డ్రామాలో జోడించి డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరుకు ప్రతీ ఒక్కరు ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి అద్భుతమైన సినిమాలను నిర్మిస్తున్నందుకు నాని(Natural Star Nani) కి కూడా విమర్శకుల ప్రశంసలు అందాయి. ఓపెనింగ్స్ దగ్గర నుండే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఈ సినిమా విడుదలై 9 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 9 రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. 7 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం రెండవ రోజే ఆ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది.
Also Read: సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు..మధ్యలోనే ఆగిపోయిన సినిమా!
వీకెండ్ కి ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను చూసి, కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ ని చూస్తుంటే, ఈ చిత్రం 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. 9 రోజుల్లో ఈ సినిమాకు 43 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందట. 8 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 9వ రోజున ఏకంగా కోటి 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు 9వ రోజున వచ్చాయట. ఇది మామూలు విషయం కాదు.
నేటి తో ఈ చిత్రం కచ్చితంగా 48 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని, రేపటి తో 50 కోట్లకు రీచ్ అవుతుందని అంటున్నారు. షేర్ విషయానికి వస్తే 9 రోజుల్లో దాదాపుగా 23 కోట్ల రూపాయిలు వచ్చింది. నైజాం ప్రాంతం నుండి 8 కోట్ల 45 లక్షలు, సీడెడ్ ప్రాంతం లో కోటి 22 లక్షలు, ఆంధ్ర ప్రాంతం లో 6 కోట్ల 50 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 16 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 4 కోట్ల 60 లక్షలు, కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియాకు కలిపి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఎందుకో సీడెడ్ ప్రాంతంలో బాగా తక్కువగా వస్తున్నట్టు అనిపిస్తుంది. మాస్ చిత్రాలను అమితంగా ఇష్టపడే సీడెడ్ ఆడియన్స్ ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామాలు కనెక్ట్ అవ్వడం కష్టమే.