Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson Net Worth: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు...

Sanju Samson Net Worth: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

Sanju Samson Net Worth: టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసంతో అదరగొట్టిన సంజు శాంసన్ ఒక్కసారిగా నేషనల్ హీరో అయిపోయాడు. అతడి గురించి వివిధ మాధ్యమాలలో విపరీతమైన చర్చ నడుస్తోంది. అతడికి సంబంధించిన ఒక్కో విషయం ఆసక్తికరమైన విధంగా కనిపిస్తోంది.

Also Read: ‘మూసీ’ రాజకీయం.. కంపు కొడుతోంది పో!

సంజు శాంసన్ కేరళ రాష్ట్రానికి చెందిన యువకుడు. చాలా సంవత్సరాల క్రితమే అతడు జట్టులోకి వచ్చినప్పటికీ.. స్థిరమైన ఆట తీరు కనబరచకపోవడంతో అతిధి ఆటగాడి పాత్రకు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే టి20 వరల్డ్ కప్ ద్వారా వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. మెరుపు వేగంతో మూడు బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి సంచలనం సృష్టించాడు. ఫలితంగా సంజు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మీద అతడు చేసిన హాఫ్ సెంచరీ ని, అంతకుముందు వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మీద చేసిన పరుగులను ఇప్పట్లో అభిమానులు మర్చిపోలేరు. దీనినిబట్టి సంజు బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సంజు ఐపీఎల్ లో గత సీజన్లో అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈసారి మాత్రం అతడు అదరగొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అతడు ఉన్న ఫామ్ అలా ఉంది మరి. కేవలం అద్భుతమైన ఆటగాడిగా మాత్రమే కాకుండా.. అంతకు మించిన ఆస్తిపరుడిగా సంజు శాంసన్ కొనసాగుతున్నాడు. ఇతడి ఆస్తులు దాదాపు 100 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాలలో స్థిరాస్తులు, చరాస్తులు ఇతడికి ఉన్నాయి. ఖరీదైన వాహనాలు.. బంగారు ఆభరణాలు ఇతడి వద్ద ఉన్నాయి. అందువల్లే సంజు ఇంత స్థాయికి ఎదిగాడు.

ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బును.. బీసీసీఐ అందించే మ్యాచ్ ఫీజును సంజు తెలివిగా స్థిరాస్తుల కొనుగోలుకు ఉపయోగించాడు. దీని వెనక అతని భార్య కూడా ఉంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉండడంతో సంజు భారీగా ఆస్తులను కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ ఆస్తులు బహిరంగ మార్కెట్లో విపరీతమైన ధరను సొంతం చేసుకున్నాయి. అందువల్లే సంజు ఇన్ని కోట్లకు అధిపతిగా మారిపోయాడు. అనేక ప్రవేట్ సంస్థలకు అతడు ప్రయోజక కర్తగా వ్యవహరిస్తున్నాడు. అటు ఐపిఎల్.. ఇటు బీసీసీఐ.. మధ్యలో ప్రైవేట్ సంస్థలకు ప్రయోజక కర్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సంజు భారీగా సంపాదిస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version