Kurnool Corporation
Kurnool Corporation :ఎట్టకేలకు కర్నూలు జిల్లా( Kurnool district) పై పూర్తి పట్టు కోసం టిడిపి కూటమి ప్రయత్నాలు ప్రారంభించింది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. ఇదే దూకుడుతో స్థానిక సంస్థలను సైతం కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పై దృష్టి పెట్టింది. మేయర్ పీఠంపై కన్నేసిన టిడిపి త్వరలో అవిశ్వాసం పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మార్చి 18 తో మేయర్ పదవీకాలం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. అవిశ్వాస తీర్మానానికి అవకాశం కలిగింది. వాస్తవానికి కర్నూలు కార్పొరేషన్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఫిగర్స్ తారుమారు అయ్యాయి.
Also Read: అయ్యా చంద్రబాబు గారు.. ఇంకెప్పుడయ్యా?
* అప్పట్లో ఏకపక్ష విజయం
2021 కార్పొరేషన్ ఎన్నికల్లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్( Kurnool Municipal Corporation) మేయర్ పీఠాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మొత్తం 52 డివిజన్లకు గాను 43 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు సైతం గెలిచారు. మరోవైపు చాలామంది కార్పొరేటర్లు టిడిపి కూటమి టచ్ లో ఉన్నారు. అందుకే మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టిడిపి పావులు కదుపుతున్నట్లు సమాచారం. అదే సమయంలో మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది.
* సాధారణ ఎన్నికల్లో గెలుపు..
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా పై పూర్తి పట్టు సాధించింది కూటమి( Alliance). జిల్లాలో ఎంపీ స్థానాలతో పాటు మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను సైతం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే ఊపుతో కర్నూలు మేయర్ పోస్ట్ పై దృష్టి పెట్టింది. నగరపాలక సంస్థలు మొత్తం 52 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో 36 మంది కర్నూలు నగరానికి చెందినవారు. పాణ్యం నియోజకవర్గంలో 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో మరో ముగ్గురు కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండడంతో కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో పడింది కూటమి.
* బలాబలాలు తారుమారు..
గతంలో 43 మంది కార్పొరేటర్లతో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలామంది కార్పొరేటర్లు కూటమికి టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 28 మంది కార్పొరేటర్ల బలం ఉంటే చాలు. దీనికి తోడు ఎక్స్ ఆఫిషియో లో సభ్యులుగా ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి సాయంతో కర్నూలు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధపడింది టిడిపి. త్వరలో కూటమి నేతలు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించనున్నారు. తరువాత అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు.
Also Read : జగన్ అడ్డాలో క్యాంపు పాలిటిక్స్.. గట్టిగానే కూటమి సవాల్!