Couple Friendly Twitter Talk: ప్రతీ ఏడాది లాగానే , ఈ ఏడాది కూడా మన టాలీవుడ్ లో వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. వాటిల్లో ఒకటి ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). సంతోష్ శోభన్(Santosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాకు అశ్విన్ చంద్ర శేఖర్ అనే తమిళ దర్శకుడు దర్శకత్వం వహించాడు. సంతోష్ శోభన్ మంచి నటుడు అయినప్పటికీ చాలా కాలం నుండి సరైన సినిమా పడక, కమర్షియల్ గా ఆశించిన స్థాయిని అందుకోలేదు. ఈ కుర్రాడికి సరైన సినిమా పడితే బాగుండును అని అంతా అనుకున్నారు. అదే విధంగా హీరోయిన్ మానస వారణాసి కూడా చూసేందుకు చాలా అందంగా ఉంటుంది, ఇంత చిన్న సినిమాలకే పరిమితం అవ్వడం అన్యాయం అని అంత అనుకునేవారు. అలా వీళ్ళిద్దరిని ఇష్టపడే వారికి ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత కెరీర్ కి అవసరమయ్యే సినిమా పడిందని అందరికీ అనిపించింది.
#CoupleFriendly Movie review By @NizamBoxOfc
This movie is decent and gives a good feel ❤️
The lead pair performed really well and looked very natural on screen
The director was fairly successful in storytelling.
Music is a major plus
A feel-good journey with a bittersweet… https://t.co/92yLY5zq59— Nizam Box Office (@NizamBoxOfc) February 14, 2026
అలా విడుదలకు ముందే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తో నేడు విడుదలైన ఈ చిత్రం, ఆడియన్స్ ని ఆకట్టుకుండా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రాన్ని ట్విట్టర్ లో చూసిన ఆడియన్స్ పాజిటివ్ రివ్యూస్ ని కుమ్మరిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ మానస వారణాసి పై ప్రశంసల వర్షము కురిపిస్తున్నారు. కొన్ని సినిమాలు థియేటర్స్ లో చూసిన తర్వాత ఒక మంచి సినిమాని చూశాము అనే తృప్తి తో ముఖం పై చిరునవ్వుతో బయటకు వస్తుంటాం, అలాంటి సినిమాల్లో ఇది కూడా ఒకటని అంటున్నారు ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు. కథ విషయానికి వస్తే ఒక నెల్లూరు కుర్రాడు, చిత్తూరు అమ్మాయి, ఉద్యోగం కోసం చెన్నై కి వస్తారు. అనుకోకుండా వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం, ఆ తర్వాత లివింగ్ రిలేషన్ షిప్ చేయడం, చివరికి పెళ్లి వరకు వచ్చేలోపు వీళ్ళ మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుంది.
కపుల్ ఫ్రెండ్లీ.. క్లీన్ లవ్ స్టోరీ.. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు సూపర్బ్ .. డైరక్షన్ బాగుంది. మంచి సాంగ్స్ ఉంటే బాగుండేది.
ఓ మళయాలం చూస్తున్నా ఫీలింగ్ ఉంటుంది.. స్లో నరేషన్ కొంచం ఇబ్బంది పెడుతుంది..సంతోష్ శోభన్ కు చాలా కాలం తర్వాత మంచి హిట్..
Rating: 3।5 #CoupleFriendly https://t.co/NlsaR9OUpZ— తార-సితార (@Tsr1257) February 14, 2026
సినిమా మొత్తం స్లో స్క్రీన్ ప్లే న్యారేషన్ తోనే ఉంటుంది కానీ, ఎక్కడా కూడా బోర్ అనే ఫీలింగ్ రాలేదని అంటున్నారు. ఈ చిత్రం హీరో హీరోయిన్ మధ్య వచ్చే ముద్దు సన్నివేశాలు హైలైట్ అనే చెప్పాలి. చాలా నేచురల్ గా, ఇద్దరు భార్య భర్తల మధ్య సంపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు చేసుకునే రొమాన్స్ ఎలా ఉంటుందో, వీళ్లిద్దరి మరి రొమాంటిక్ సన్నివేశాలు కూడా అలాగే ఉన్నాయి. వీళ్లిద్దరు నిజమైన కపుల్ అంటే నమ్మేస్తారేమో, అంత సహజంగా నటించారు. చాలా సన్నివేశాలు వెండితెర పై చూస్తున్నప్పుడు, ఇలా మన జీవితం లో కూడా జరిగింది కదా అని అనుకుంటాం. ముఖ్యంగా ప్రేమలో ఉన్న జంట కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది అంటూ ట్విట్టర్ లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సంతోష్ శోభన్ కెరీర్ లో ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతమేరకు పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
First half excellent.. Malayalam movie style vibe tho, present generation lo unna live-in relationship ni chala natural ga chupincharu.
Second half emotional ga manam story tho baga connect avutham.
Manchi feel good cinema.. perfect choice for Valentine’s Day.#CoupleFriendly https://t.co/88AnyziOKI— Mr_VINAY_ (@vinayG555) February 14, 2026
#CoupleFriendly
The Directors Conviction,Actors Dedication,
Producers Belief
Delivers a feelgood movie in the valentine’s weekend @DheeMogilineni Congratulations
— Taraq(Tarak Ram) (@tarakviews) February 14, 2026