Homeఎంటర్టైన్మెంట్Prabhas hot comments: నాకు ప్రేమలో పడాలని ఉంది అంటూ ప్రభాస్ హాట్ కామెంట్స్..వీడియో వైరల్!

Prabhas hot comments: నాకు ప్రేమలో పడాలని ఉంది అంటూ ప్రభాస్ హాట్ కామెంట్స్..వీడియో వైరల్!

Prabhas hot comments: పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas). ప్రస్తుతం ప్రభాస్ వయస్సు 46 ఏళ్ళు, ఇప్పటికీ ఆయన పెళ్లి చేసుకోకపోవడం పై అభిమానుల్లో అసంతృప్తి ఉంది. పలానా హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ ఏడాదికి ఒక వార్త వస్తూనే ఉంటుంది. కానీ ఒక్కటి కూడా నిజం అవ్వలేదు. ఇక కృష్ణంరాజు బ్రతికి ఉన్నన్ని రోజులు ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ అడిగేవారు. ఈ సినిమా తర్వాత కచ్చితంగా చేసుకుంటాడు అని చెప్పేవాడు. ఒకానొక సందర్భంలో రిపోర్టర్స్ ఈ ప్రశ్న అడిగినప్పుడు కృష్ణంరాజు కోపగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ పెద్దమ్మ మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా రిపోర్టర్స్ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకొని రావడం, సంబంధాలు చూస్తున్నాం అని ఆమె సమాధానం ఇవ్వడం కామన్ అయిపోయింది.

కానీ పెళ్లి మాత్రం జరగడం లేదు. అయితే రీసెంట్ గా ప్రభాస్ ప్రేమ, పెళ్లి టాపిక్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. విషయం లోకి వెళ్తే సంతోష్ శోభన్(Santosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) హీరో హీరోయిన్లు గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly) పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు బాగా కనెక్ట్ అయ్యారు. సంతోష్ శోభన్ ప్రభాస్ కి బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి, ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా వాళ్ళ కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. ఈ ఇంటర్వ్యూ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. సంతోష్ శోభన్ తండ్రి శోభన్ ప్రభాస్ తో వర్షం లాంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అప్పటి నుండి ప్రభాస్ ఈ కుటుంబానికి మంచి సన్నిహితుడు.

సంతోష్ శోభన్ కోసం అనేక సార్లు ఆయన ప్రొమోషన్స్ కూడా చేశాడు. ఈసారి ఏకంగా ఆయన కోసం ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా సరదాగా సాగిపోయింది. ప్రభాస్ ని హీరోయిన్ మానస వారణాసి ఒక ప్రశ్న అడుగుతూ ‘ప్రేమ పై మీ అభిప్రాయం ఏంటి’ అని అడుగుతుంది. అందుకు ప్రభాస్ ‘నా వ్యక్తిగత విషయాలను అడగాలని చూస్తున్నావ్ గా , నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. సరైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను’ అని సమాధానం చెప్తాడు . ఆద్యంతం ఫన్నీ గా సాగిపోయిన ఈ ఇంటర్వ్యూ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

DARLING Talks Full Interaction | Couple Friendly | Prabhas | Santosh Soban, Manasa Varanasi | Ashwin

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version