Homeటాప్ స్టోరీస్Andhra Pradesh SIR : బీజేపీ నేతలపై ఒంటికాలిపై లేచి లైవ్ లో శివతాండవం చేసిన...

Andhra Pradesh SIR : బీజేపీ నేతలపై ఒంటికాలిపై లేచి లైవ్ లో శివతాండవం చేసిన టీవీ5 మూర్తి.. వైరల్ వీడియో

Andhra Pradesh SIR : ఓటర్ల జాబితా సవరణ, ఎస్‌ఐఆర్‌ (Special Intensive Revision) ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై టీవీ5 ఎడిటర్ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా టీడీపీ అనుకూల వైఖరితో కనిపించే టీవీ5 చానెల్‌లోనే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో సామాన్య ఓటర్లకు ఇబ్బందులు కలిగించే […]

Andhra Pradesh SIR : ఓటర్ల జాబితా సవరణ, ఎస్‌ఐఆర్‌ (Special Intensive Revision) ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై టీవీ5 ఎడిటర్ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా టీడీపీ అనుకూల వైఖరితో కనిపించే టీవీ5 చానెల్‌లోనే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఓటర్ల జాబితా సవరణ పేరుతో సామాన్య ఓటర్లకు ఇబ్బందులు కలిగించే విధానం ఎందుకంటూ మూర్తి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక వ్యక్తి తన ఓటు హక్కును కలిగి ఉన్నప్పటికీ.. దానిని తొలగించి, తిరిగి అదే వ్యక్తి తన అర్హతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. “నా ఓటు తీసేసి.. నన్నే నిరూపించుకోమనటం ఏంటి?” అంటూ లైవ్ డిబేట్‌లో ఆయన తీవ్రంగా స్పందించారు.

బీజేపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై మాట్లాడే సమయంలో మూర్తి బీజేపీ నేతల తీరుపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా విషయంలో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పట్టించుకోకుండా రాజకీయ కోణంలో వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా, బీజేపీ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉండటంతో ఏపీ రాజకీయాల్లో ఈ మూడు పార్టీల మధ్య సమన్వయం కీలకంగా మారింది.

ఇలాంటి సమయంలో టీడీపీకి అనుకూలంగా భావించే టీవీ5 వేదికగా ఎస్‌ఐఆర్‌పై తీవ్ర విమర్శలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా బీజేపీ నేతలపై మూర్తిష్ణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణుల్లోనూ చర్చ మొదలైనట్లు తెలుస్తోంది.
చంద్రబాబుకు తెలుసా?

టీవీ5 ఎడిటర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధిష్ఠానం దృష్టికి వెళ్లాయా? ఈ వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం కొనసాగుతున్న సమయంలో.. కూటమిలోని ఒక భాగస్వామిపై టీడీపీ అనుకూల మీడియా వేదికగా ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు రావడం చర్చకు దారితీస్తోంది.

అయితే ఇది మూర్తి వ్యక్తిగత అభిప్రాయమా? లేక ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో ఉన్న ఆందోళనలకు ప్రతిబింబమా? అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా “నా ఓటు తీసేసి నన్నే నిరూపించుకోమనటం ఏంటి?” అన్న మురళీకృష్ణ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper