Homeఎంటర్టైన్మెంట్సినిమా ఫొటోలుGolam movie : ఓటిటి రచ్చ లేపుతున్న మలయాళం ఫిల్మ్...అవేం ట్విస్టులురా సామి...ఇంతకీ ఆ సినిమా...

Golam movie : ఓటిటి రచ్చ లేపుతున్న మలయాళం ఫిల్మ్…అవేం ట్విస్టులురా సామి…ఇంతకీ ఆ సినిమా ఏంటి..?ఎక్కడ చూడచ్చు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ మలయాళం ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు వస్తున్నాయి. వాళ్ళు ఇప్పటికి కూడా కొత్త తరహా సినిమాలు చేయడానికి ఇష్టపడతారు తప్ప రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలు చేయడానికి అసక్తి చూపించరు...

Golam movie : మలయాళం సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. నిజానికి అక్కడ స్టార్ హీరోలతో సంబంధం లేకుండా కొత్త హీరోలు కూడా ఎక్స్పరిమెంట్లను చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తూ ఉంటారు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి మలయాళం సినిమా ఇండస్ట్రీ పెట్టింది పేరుగా మారింది. అక్కడి నుంచి వచ్చిన చాలా సినిమాలు ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్టారు. లేదంటే రీమేక్ చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘గోళమ్ ‘అనే సినిమా ఓటిటి లో సందడి చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేస్తుందనే చెప్పాలి. సంజద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ సక్సెస్ ను కూడా నమోదు చేసుకుంది. ఇక ఓటిటి లో భారీ వ్యూయర్ షిప్ ను సంపాదించుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఈ సినిమా టాప్ లెవెల్లో నిలవడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం అందరూ ఈ సినిమాని చూడడానికి విపరీతంగా ఆసక్తిని చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

రంజిత్ సంజీవ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని భారీగా ఎంగేజ్ చేస్తూ థ్రిల్లర్ సినిమాలన్నింటిలో ఒక బెంచ్ మార్క్ గా నిలుస్తుందనే చెప్పాలి. ఇక మలయాళ సినిమా ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు ఏదైనా కొత్త తరహా కథతో సినిమా వచ్చింది అంటే చాలు అది మలయాళం నుంచి వచ్చిందే అనేంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది.

ఈ ఇండస్ట్రీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా భారీ వ్యూయర్ షిప్ ను సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాను చూసిన చాలా మంది ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది…

ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చాలి అంటే అందులో చాలా వరకు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ అయితే ఉండాలి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ థ్రిల్లర్ సినిమాని చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు వేరే లోకంలో విహారిస్తున్నట్టుగా ఉండడం అనేది నిజంగా ఈ సినిమా చేసిన మ్యాజిక్ అనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper