spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఫొటోలుdirectors : సౌత్ లో టాప్ 5 స్టార్ కమర్షియల్ డైరెక్టర్స్ వీళ్లేనా..?

directors : సౌత్ లో టాప్ 5 స్టార్ కమర్షియల్ డైరెక్టర్స్ వీళ్లేనా..?

directors : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సౌత్ సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి సినిమాలు చేస్తున్న ప్రతి దర్శకుడు కూడా పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న టాప్ 5 దర్శకులు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
రాజమౌళి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్తానాన్ని మొదలు పెట్టిన రాజమౌళి బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఇక కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతల పెను సంచలనాలను సృష్టిస్తున్నాడు…
సందీప్ రెడ్డి వంగ
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ ని అందించిన ఆయన అనిమల్ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ సినిమా దాదాపు 900 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిందంటే మామూలు విషయం కాదు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు…
అట్లీ
తమిళ్ సినిమా దర్శకుడు అయినప్పటికీ ఈయనకి ఇండియా వైడ్ గా మంచి మార్కెట్ అయితే ఉంది. ఆయన మొదటగా చేసిన రాజా రాణి సినిమాతో ప్రేక్షకుల్లో ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ గా తనని తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు…
ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ సినిమాతో తనకంటూ భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఈయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక కమర్షియల్ సినిమాలను తీయడంలో ఈయనకు సపరేట్ స్టైల్ ఉంది. అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా డార్క్ మోడ్ లో ఉండడమే కాకుండా భారీ కలెక్షన్స్ ను కూడా సంపాదించి పెడుతున్నాయి. ఇక ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాతో  దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు…
సుకుమార్
సుకుమార్ మొదట్లో డిఫరెంట్ సినిమాలను  తెరకెక్కించాడు. కానీ రంగస్థలం సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు చేస్తున్న అన్ని సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘పుష్ప 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు…
Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Oktelugu Epaper