Balayya : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటూ వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అయినప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న బాలయ్య బాబు క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పాలి… ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
నందమూరి నటసింహంగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)… ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను నమోదు చేసుకున్న ఆయన ‘అఖండ 2’ (Akhanda 2) సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడి తో ఒక సినిమా గోపీచంద్ మలినేని తో మరొక సినిమా కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికైతే బాలయ్య బాబు వరుసగా కమర్షియల్ డైరెక్టర్లను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
Also Read : ఎన్టీఆర్ బాలయ్య కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందా..?
వరుస విజయాలను అందుకుంటు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయగలిగే కెపాసిటీ ఉన్న బాలయ్య ఈ సంవత్సరం వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించాడు. మరి అఖండ 2 సినిమా అంతకుమించిన వసూళ్లను రాబడుతుందనే నమ్మకంతో ఉన్నారు.
ఇక అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ లాంటి ముగ్గురు కమర్షియల్ డైరెక్టర్లతో సినిమాలు చేసి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఈ మూడు సినిమాలు కనుక సక్సెస్ అయినట్లయితే బాలయ్య బాబుకి అదనంగా మరో మూడు సక్సెసు లైతే వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ ముగ్గురికి బాలయ్య బాబుని ఎలా చూపించాలి అనే ఒక విజన్ అయితే ఉంది.
అందులో అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ఇద్దరు కూడా బాలయ్య బాబుతో ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నారు. కాబట్టి మరో సినిమాని ఏ రేంజ్ లో చేయాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్ళందరూ కూడా బాలయ్యను చాలా బాగా ఎలివేట్ చేస్తూ చూపించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.
Also Read : ఆ విషయం లో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన బాలయ్య…వర్కౌట్ అవుతుందా..?