Homeఆంధ్రప్రదేశ్‌AP 10th Results 2026: ఏపీ టెన్త్ ఫలితాల్లో బాలికలదే టాప్!

AP 10th Results 2026: ఏపీ టెన్త్ ఫలితాల్లో బాలికలదే టాప్!

AP 10th Results 2026: ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2025 -26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ రిలీజ్ చేశారు ఈ ఫలితాలను. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరీక్షల్లో విద్యార్థులు 85.25% ఉత్తీర్ణత సాధించారు. 87.90% ఉత్తీర్ణతతో బాలికలు పై చేయి సాధించారు. బాలురు మాత్రం 82.68 శాతానికి పరిమితం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.30 […]

AP 10th Results 2026: ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2025 -26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ రిలీజ్ చేశారు ఈ ఫలితాలను. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరీక్షల్లో విద్యార్థులు 85.25% ఉత్తీర్ణత సాధించారు. 87.90% ఉత్తీర్ణతతో బాలికలు పై చేయి సాధించారు. బాలురు మాత్రం 82.68 శాతానికి పరిమితం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.30 లక్షల మంది పరీక్షలు రాశారు.
* ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి.
* ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఏడాది 72.8% ఫలితాలు రాగా.. ఈ ఏడాది మాత్రం 78.39% ఉత్తీర్ణత నమోదయింది.
* పదో తరగతి ఫలితాలను www.results.bse.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చు.
* వాట్సాప్ మన మిత్ర సేవ ద్వారా 9552300009 కు హాయ్ అని ఇంగ్లీషులో పంపించడం ద్వారా పూర్తి వివరాలు నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
* LEAP యాప్, డిజి లాకర్ యాప్, పాఠశాల లాగిన్ లో కూడా విద్యార్థులు పదో తరగతి ఫలితాలు చూడవచ్చు.
* మరోవైపు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎటువంటి అధైర్యం పడనవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ రివెరిఫికేషన్, రీకౌంటింగ్, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు అవకాశం కల్పించనుంది.
* మరోవైపు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. మీ కృషి, అంకితభావం ఫలించాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందవద్దు. ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే. మళ్లీ ధైర్యంగా ప్రయత్నించండి అంటూ ధైర్యం చెప్పారు మంత్రి నారా లోకేష్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper