spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Comments On Mission Impossible Producer: ఇన్నాళ్లకు ఓ మంచి నిర్మాతని చూశాను...

Chiranjeevi Comments On Mission Impossible Producer: ఇన్నాళ్లకు ఓ మంచి నిర్మాతని చూశాను – మెగాస్టార్

Chiranjeevi Comments On Mission Impossible Producer:  టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను తెలుగులో చాలా గ్యాప్ తర్వాత చేస్తోన్న తెలుగు సినిమా`మిష‌న్ ఇంపాజిబుల్‌`. కాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజేవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “నిర్మాత నిరంజన్‌ రెడ్డి ఒక పక్క ‘ఆచార్య’ చేస్తూ, మరో పక్క ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమా చేశారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను.

Chiranjeevi Comments On Mission Impossible Producer
Chiranjeevi

నేను ఇప్పటికే ఈ సినిమాని చూడటం జరిగింది. నాకు అద్భుతంగా అనిపించింది. తాప్సి చాలా మంచి పాత్రలో కనిపించింది. దర్శకుడు స్వరూప్‌ ఇప్పటికే తన దర్శకత్వ పనితనాన్ని నిరూపించుకున్నారు. ఈ సినిమాతో మళ్ళీ తను ఘనంగా నిరూపించుకున్నాడు. ఇందులో చిన్న పిల్లలు ఉండొచ్చు.. కానీ, ఇది చిన్న సినిమా కాదు. నిర్మాతలు కథలోనూ, సినిమా ప్రయాణంలోనూ లీనం కావాలి.

Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న హీరోయిన్ గా, త‌ల్లిగా న‌టించింది ఎవ‌రో తెలుసా..?

నిర్మాత డబ్బు పెట్టే ఓ ఫైనాన్షియర్‌గా మారిపోతున్న రోజులివి. అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, కె. ఎస్‌.రామారావు, దేవీప్రసాద్‌… వీళ్లంతా సినిమాల్లో అన్నింట్లోనూ లీనమయ్యేవారు. అందుకే వాళ్లు అంత గొప్ప చిత్రాలు తీయగలిగారు. మేము చేయగలిగాము. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత నిరంజన్‌ రూపంలో ఓ మంచి అభిరుచిగల నిర్మాతని నేను చూశాను.

పెద్ద మనసుతో ఈ సినిమా చూస్తే ఇందులో మంచి హృదయం కనిపిస్తుంది. నన్ను నమ్మి వెళితే నిరుత్సాహపడరనే భరోసా ఇస్తున్నా. ఇక ‘ఆర్‌. ఆర్‌.ఆర్‌’ భారతీయ పరిశ్రమ గర్వించే సినిమా అయ్యింది. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ తరహా సినిమాల్ని ఆదరిస్తే అందరిలోనూ ఉత్సాహం వస్తుంది” అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్పీచ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Chiranjeevi
Megastar Chiranjeevi

కాగా మిష‌న్ ఇంపాజిబుల్‌` చిన్న చిత్రమే అయినా.. సినిమాలో కంటెంట్ పరంగా గొప్ప సినిమా అని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందుకే.. ‘మిష‌న్ ఇంపాజిబుల్‌` రిలీజ్ విషయంలో మేకర్స్ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రంతో మంచి హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్.ఎస్‌.జె ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

తెలుగు ఇండస్ట్రీలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌ గా చేస్తుంటే.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: SS Rajamouli Personal Life: రాజ‌మౌళిది పెద్ద జ‌మిందారి కుటుంబం.. అప్ప‌ట్లోనే వారి ఆస్తులు ఎన్నో తెలుసా..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper