Prabhas – Bollywood heroes : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయనను అందుకోవడంలో ఏ హీరో కూడా ఆయన దరిదాపుల్లో కూడా లేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా 300 కోట్లకు పైన కలెక్షన్లను వసూలు చేస్తూ సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేస్తున్నాయి.
ఇక అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చేస్తున్న కల్కి, రాజసాబ్ లాంటి సినిమాలు కూడా ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడైతే వస్తుందో ఆ డేట్ ని చూసుకొని మరి బాలీవుడ్ హీరోలు ఆ డేట్ లో వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయకుండా వేరే డేట్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇంతకు ముందు సలార్ సినిమాతో పోటీగా షారుఖ్ ఖాన్ డంకి సినిమా వచ్చింది.
సలార్ సినిమా సూపర్ హిట్ అవ్వగా, డంకి సినిమా ఫ్లాప్ అయింది. ఇక అందుకే ప్రభాస్ తో పోటీ ఎందుకు అనే ఉద్దేశ్యం లో సగటు హీరోలందరూ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్ మెయిన్ లీడ్ లో వస్తున్న ‘సింగం ఎగైన్’ అనే సినిమా కూడా ప్రభాస్ కి పోటీ గా దింపాలనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రభాస్ తో పోటీ పడలేక మళ్ళీ ఆ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది…
ఇక అందులో భాగంగానే ప్రభాస్ ఏదైనా సినిమాను అనౌన్స్ చేసిన వెంటనే ఆయన సినిమాలా రిలీజ్ డేట్స్ లో ఎప్పుడెప్పుడు ఉన్నాయో చూసుకొని ఆయా సినిమా మేకర్స్ వాళ్ల సినిమాల రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసుకుంటున్నారు. ఇక ఈ రకంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరో కి ఇండస్ట్రీలో పోటీ ఎవరూ లేరు అనేంతలా ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి…