RaviTeja Birthday Special : ఈ నెల 26వ తేదీన మాస్ మహారాజా రవితేజ పుట్టిన రోజు. కాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా.. ఆ రోజు ఉదయం రవితేజ కొత్త సినిమాల అప్ డేట్స్ రానున్నాయి. ముఖ్యంగా రవితేజ పుట్టిన రోజు నాడు మొత్తం 6 సినిమాల అప్డేట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొదట రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడీ’ మూవీ గురించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్ డేట్ ను విడుదల చేసింది. ఈ నెల 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా.. ఆ రోజు ఉదయం 10.08 గంటలకు ‘ఫుల్ కిక్కు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తామని ప్రకటించింది.