Bigg Boss Telugu 8: నిన్నటి ఎపిసోడ్ లో సీత నిఖిల్ మీద వేసి నిందలు మామూలివి కావు. హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ అమ్మాయిలను తన ఎమోషనల్ ట్రాప్ లోకి లాగి, వాళ్ళని బాగా డౌన్ చేసి, నిఖిల్ గేమ్స్ ఆడుతున్నాడు అంటూ సీత దారుణమైన నింద వేసింది. దీనికి నిఖిల్ చాలా బాదపడిపోతాడు. మానసికంగా కృంగిపోతాడు. రాత్రి అన్నం కూడా తినకుండా పడుకునేస్తాడు. పృథ్వీ, అవినాష్,తేజ , గౌతమ్ ఇలా హౌస్ మొత్తం నిఖిల్ ని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది. పృథ్వీ నిఖిల్ తో మాట్లాడుతూ ‘నువ్వు యష్మీ తో ఒకసారి మాట్లాడు. ఎప్పుడైనా నా గేమ్ కోసం నిన్ను వాడుకున్నట్టు అనిపించిందా అని అడుగు..ఆమె నోటి నుండి వచ్చే సమాధానం జనాల్లోకి వెళ్ళాలి’ అని అంటాడు. పృథ్వీ చెప్పినట్టుగానే నిఖిల్ ఉదయాన్నే యష్మీ ని ఈ విషయం గురించి అడుగుతాడు.
నిఖిల్ యష్మీ తో మాట్లాడుతూ ‘నిన్న రాత్రి సీత నా మీద ఒక నింద వేసింది, నీకు అది గుర్తుందా..?, నేను నిన్ను నా గేమ్ కోసం వాడుకున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా?’ అని యష్మీ ని అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు’. అప్పుడు నిఖిల్ ‘మరి ఆ విషయం ఆమెకు అక్కడే చెప్పొచ్చు కదా’ అని అంటాడు. ‘ఆమె ఆ మాట అనగానే నా మైండ్ బ్లాక్ అయ్యింది..అదేంటి..నిజంగా ఇలా నన్ను వాడుకున్నాడా? , దేనిని ఉద్దేశించి ఆమె ఇది చెప్తుంది అని ఆలోచిస్తున్నాను’ అంటుంది యష్మీ. అప్పుడు నిఖిల్ ‘ఆమె అడగగానే నువ్వు నిజమే అన్నట్టు తల ఊపావు ఎందుకు?’ అని అడుగుతాడు నిఖిల్. ‘ఆమె పానీ పట్ యుద్ధం టాస్క్ లో నువ్వు ఎంతో ఎఫర్ట్ పెట్టావు. కానీ దానిని ఎవ్వరూ గుర్తించలేదు. కారణం నిఖిల్ తో నువ్వు ఎక్కువగా ఉండడం వల్లే అని చెప్తుంది. నేను దానికి థాంక్యూ చెప్పాను. నిన్ను అన్నందుకు కాదు’ అని అంటుంది యష్మీ.
అలా వీళ్లిద్దరి మధ్య చర్చలు ముగిసిన తర్వాత నిఖిల్ కెమెరాలతో మాట్లాడుతూ ‘ నేను బిగ్ బాస్ కి వచ్చినప్పుడు నాకు కొంతమంది మాత్రమే తెలుసు. నేను ఎప్పుడూ ఎవరినీ తొక్కి గేమ్ లోకి ముందుకు వెళ్లాలని అనుకోలేదు. నిన్న నామినేషన్ లో సీత చెప్పినట్టు ఒక స్ట్రాంగ్ అమ్మాయిని వాడుకొని నేనెప్పుడూ గేమ్ లో గెలవాలని అనుకోలేదు. నేను ఆడియన్స్ కి ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. నాకు ఇప్పటి వరకు సపోర్టు చేస్తూ ఓటు వేస్తూ వచ్చిన ప్రతీ ఒక్కరికి కృతఙ్ఞతలు. ఈ వారం నేను నామినేషన్స్ లో ఉన్నాను, నాకు ఇంటికి వెళ్లాలని అనిపిస్తుంది, ఆడియన్స్ నాకు ఓటింగ్ చేయకండి ఈసారి’ అని అంటాడు. కాసేపటి తర్వాత నబీల్, పృథ్వీ నిఖిల్ వద్దకు వచ్చి ధైర్యం చెప్పిన తర్వాత నిఖిల్ సర్దుకొని, వాష్ రూమ్ వద్ద ఉన్న కెమెరాల దగ్గరకు వచ్చి, ఇందాక అలా మాట్లాడినందుకు క్షమించండి, నాకు ఓట్లు వేయండి అని అంటాడు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss telugu 8 i cant play anymore dont vote for me eliminate me nikhil requested the audience
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com