Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే మనకి కొంతమంది మీద పాజిటివ్ అభిప్రాయం కలుగుతుంది. లుక్స్ పరంగా కానీ, బయట వ్యవహరించిన తీరుని బట్టి కానీ, ఇలాంటి అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అలా మనకి మొదటి ఎపిసోడ్ నుండే పాజిటివ్ అభిప్రాయం క్రియేట్ అయ్యేలా చేసిన కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రేరణా కంభం. ఈమె బిగ్ బాస్ షో కి ముందు స్టార్ మా ఛానల్ లో ప్రతీ వారం ప్రసారం అయ్యే ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ అనే గేమ్ షోలో అద్భుతంగా ఆడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈమె ఆట తీరుకి మగవాళ్ళు సైతం బెదిరిపోయేవారు. ఆ స్థాయిలో ఆమె గేమ్ ఆడింది. ఇలాంటోళ్ళు కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాలని అందరూ అనుకున్నారు. అందరి కోరికమేర ఆమె హౌస్ లోకి అడుగుపెట్టింది. టాస్కులు అదరగొట్టేస్తుంది, చాలా అందంగా ఉంది కూడా, కచ్చితంగా ఈమె టాప్ 5 లోకి వచ్చేస్తుంది, టైటిల్ గెలిచేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అందరూ అనుకున్నారు.
కానీ ఆ దిశగా ఈమె ప్రయాణం కొనసాగడం లేదు. ఇప్పటి వరకు ఈమెకు హౌస్ లో టాస్కులు ఆడే అవకాశం రాలేదు. మొన్న జరిగిన సాక్స్ టాస్క్ లో సంచాలక్ గా బాగా ఆడియన్స్ కి నోటీస్ అయ్యింది, కానీ తన బెస్ట్ ఇవ్వలేకపోయింది. సంచాలక్ గా సరిగా వ్యవహరించలేదు అనే కారణంతోనే నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఈమెకి అత్యధిక నామినేషన్స్ వచ్చాయి. ముఖ్యంగా నబీల్ విషయం లో ప్రేరణా తీసుకున్న నిర్ణయం తప్పే. ఆ విషయం మీదనే నబీల్ నామినేట్ చేసాడు. దీనికి ప్రేరణా మాట్లాడుతూ కంట్రోల్ తప్పింది. ‘ఏయ్..వినూ’ అని గట్టిగా అరుస్తూ నబీల్ కి వేలు చూపించి బెదిరిస్తోంది. దీనికి కంట్రోల్ తప్పిన నబీల్ ‘ఓయ్..ఏంటి బెదిరిస్తున్నావ్’ అంటూ రెచ్చిపోతాడు.
అలా వాళ్ళిద్దరి మధ్య వాదనలు పెరిగి పెద్ద గొడవకు దారి తీస్తుంది. ‘మీరు అరిస్తే గెలుస్తారు అని అంటే మీకంటే ఎక్కువగా అరవగలను’ అని అంటాడు. అప్పుడు ప్రేరణా ‘అరువు..నిన్ను ఎవరు ఆపారు?’ అని అంటుంది. ప్రేరణా కేవలం నబీల్ విషయం లో మాత్రమే కాదు, విష్ణు ప్రియ విషయంలో కూడా ఈరోజు నోరు జారింది. మొత్తం మీద ఈమె వ్యవహారం చూస్తుంటే నామినేషన్స్ లో బలమైన పాయింట్స్ చెప్పలేకపోతుంది. ఎదుటి వ్యక్తి నామినేషన్స్ సమయం లో మాట్లాడుతున్నప్పుడు వారిని పూర్తిగా మాట్లాడనివ్వదు, చాలా హైపర్ అయిపోతుంది. అదొక్కటే ఈమెలో ఉన్న మైనస్. అంతే కాదు సోషల్ మీడియా లో బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకున్న యష్మీ పృథ్వీ రాజ్ తో ఈమె స్నేహం చేయడం ఆమె అభిమానులకు నచ్చడం లేదు. వాళ్ళ నుండి బయటకి వచ్చి గేమ్ ఆడితే భవిష్యత్తులో ప్రేరణా టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఆమె ఆ విధంగా నడుచుకొని ముందుకు పోతుందా లేదా అనేది భవిష్యత్తులో చూడాలి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More