Abbas: చాలామంది హీరోలు కెరియర్ మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోలుగా రాణించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలకు వరుస సక్సెస్ లు వరిస్తే, మరి కొంతమంది మాత్రం వరుస ఫెయిల్యూర్స్ మూటగట్టుకొని ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయే పరిస్థితి రావచ్చు… ‘ప్రేమదేశం’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అబ్బాస్ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో టాప్ హీరో అయ్యాడు. అప్పటి నుంచి వరుసగా చాలా సినిమాల్లో నటించాడు. అయినప్పటికి ఆయనకు సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ లు రాలేదు స్టార్ హీరో క్రేజ్ దక్కలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతుండడం వల్ల ఆయనకు క్రమ క్రమంగా అవకాశాలైతే తగ్గిపోయాయి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించినప్పటికి పెద్దగా ప్రయోజనం అయితే లేకుండా పోయింది. ఇక సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు ఇచ్చేవారు కరువైపోయారు… దాంతో ఆయన గత కొన్ని సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ వెళ్లి అక్కడ ఒక పెట్రోల్ బంకులో పనిచేసి ఆ తర్వాత అక్కడే సాఫ్టువేర్ జాబ్ సంపాదించుకొని ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు…
ఇక తెలుగులో సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రఘు కుంచె మనిద్దరికీ సుపరిచితుడే… ఆయనకి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కూడా విదేశాలకు వెళ్లిపోయి ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన న్యూజిలాండ్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్న క్రమంలో అబ్బాస్ తనకి కనిపించారట. మొత్తానికైతే రఘు కుంచే అబ్బాస్ తో ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు… చాలా మెమోరీస్ ను గుర్తు చేసుకుంటూ ఆయన కొన్ని మాటలైతే రాశాడు.
90 స్ లో మనందరి ఫేవరెట్ హీరో అబ్బాస్ ను కలిశానని చెప్పాడు. అలాగే అబ్బాస్ కి తను చాలా సినిమాల్లో డబ్బింగ్ కూడా చెప్పానని అందువల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పడం విశేషం… ఇక ప్రస్తుతం రఘు కుంచె కొన్ని చిన్న సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నప్పటికి సమయం దొరికిన ప్రతిసారి ఇలాంటి ట్రిప్పులను వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల తన మైండ్ రిఫ్రెష్ అవ్వడమే కాకుండా కొత్త ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉంటుంది…
ఇక మొత్తానికైతే ఒకప్పుడు అమ్మాయిల రాకుమారుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అబ్బాస్ మరోసారి మంచి క్యారెక్టర్లు దొరికితే మాత్రం సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని గత కొన్ని రోజుల నుంచి చెబుతున్నాడు…మరి దర్శక నిర్మాతలు ఒక మంచి క్యారెక్టర్ తో అబ్బాస్ ను మళ్ళీ ఇండస్ట్రీ కి తీసుకువస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…