Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హోస్టింగ్ విషయం లో నాగార్జున తీవ్రమైన విమర్శలు ఎదురుకుంటున్నాడు. అసలు ఆయన ఎపిసోడ్స్ చూడడం లేదు , బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం హోస్ట్ చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా మందికి ఆ అభిప్రాయం మారిపోయింది. వంశీ నామినేషన్స్ సమయం లో ముకేశ్ ని కామెంట్ చేస్తూ , చెల్లి చెల్లి అని చెప్పి ఝాన్సీ ని పంపేసి , వర్షిణి తో కులుకుతున్నావ్ అనే అర్థం వచ్చేలా మాట్లాడుతాడు. ఈ వీడియో ని ప్లే చేసి నాగార్జున అలా మాట్లాడడం లో తప్పు లేదు , వేరే సెన్స్ లో అన్నాడు అంటూ వంశీ ని వెనకేసుకొని రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇదేమి హోస్టింగ్ బాబూ?, అసలు నీకు ఏమైంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నాగార్జున పై మండిపడుతున్నారు.
ఒకవేళ ఇలాగే రోహిత్ మాట్లాడి మాట్లాడి ఉండుంటే కచ్చితంగా నాగార్జున ఎల్లో కార్డు ఇచ్చి ఉండేవాడని , కావాలని ఆయన త్రిగున్ మరియు అతనికి గ్రూప్ కి సంబంధించిన వాళ్ళని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడని , వాళ్ళ తప్పులను బయట పడనివ్వకుండా చేస్తున్నాడని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే గత వారం లో దేబ్జాని ముకేశ్ పై అత్యంత నీచమైన కామెంట్స్ చేసింది. మగాడు కాదని , సాలా అని నానా మాటలు అనింది. ఆమెకు వేరే లెవెల్ కోటింగ్ ఇస్తాడని అంతా అనుకుంటే, చాలా కూల్ గా క్లాస్ పీకి వదిలేసాడు. అదే రోహిత్ ఆ స్థాయి మాటలు మాట్లాడి ఉండుంటే కొత్త కార్డు ని కనిపెట్టి మరీ ఇచ్చేవాడు అంటూ నాగార్జున పై నెటిజెన్స్ సెటైర్లు విసురుతున్నారు. ఇలా చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి. మంచి రేటింగ్స్ తో వెళ్తున్న షో ని టీం సర్వ నాశనం చేస్తుందని అంటున్నారు నెటిజెన్స్.