Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam RRR Movie: భీమ్లానాయక్ ను దెబ్బకొట్టి ‘రాధేశ్యామ్’ ఆర్ఆర్ఆర్ కు ఊరటనిస్తావా జగన్?

Radhe Shyam RRR Movie: భీమ్లానాయక్ ను దెబ్బకొట్టి ‘రాధేశ్యామ్’ ఆర్ఆర్ఆర్ కు ఊరటనిస్తావా జగన్?

Radhe Shyam RRR Movie: పవన్ కల్యాణ్ నటించిన సినిమా భీమ్లా నాయక్ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించడంతో నిర్మాతలకు నష్టాలే సూచిస్తున్నాయి. పవన్ కల్యాణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నా కలెక్షన్ల పరంగా కాస్త నెమ్మదించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆశించిన మేర కలెక్షన్లు రావడం లేదు. తెలంగాణలో కలెక్షన్ల పరంగా ఫర్వా లేకున్నా ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో మాత్రం నిరాశ పరచింది. దీంతో నిర్మాతలకు నష్టాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతోనే ఇలా జరుగుతుందని భావిస్తున్నారు. జగన్ కక్ష పూరిత విధానాలతో అప్రదిష్ట మూటగట్టుకుంటున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

అయినా జగన్ లో మాత్రం మార్పు రావడం లేదు. పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా ఆయన సినిమాలను టార్గెట్ చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సినిమా వంద కోట్ల వసూళ్లు దాటినా నిర్మాతలు పెట్టిన ఖర్చు ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కంగారు పడుతున్నారు. వారు పెట్టిన పెట్టుబడి ఇంకా రూ. ఐదు కోట్లు రావాల్సి ఉంది. కానీ ఈనెల 11న ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రానుండటంతో దాని ప్రభావం భీమ్లా నాయక్ పై పడుతుందని భయ పడుతున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ కూడా విడుదలకు సిద్ధంగా ఉండటంతో భీమ్లా నాయక్ సినిమాకు మాత్రం నష్టాలు వస్తున్నాయని మాత్రం విశదమవుతోంది.

సీఎం జగన్ వ్యక్తిగత విద్వేషాలతో సినిమాలను టార్గెట్ చేసుకోవడంపై సహజంగా విమర్శలు వస్తున్నాయి. కానీ జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు. భీమ్లా నాయక్ సినిమా కు కావాలనే టికెట్ల ధరలు తగ్గించి దెబ్బకొట్టాలని భావించినట్లు తెలుస్తోంది.చిరంజీవి లాంటి పెద్దలు సీఎం జగన్ ను కలిసినా వారికి అభయం ఇచ్చిన జగన్ తరువాత మాత్రం పవన్ కల్యాణ్ సినిమాను కలెక్షన్లు రాకుండా చేయడంలో భాగంగానే టికెట్ల ధరలు తగ్గించినట్లు చెబుతున్నారు. ఒక వారంలో తగ్గించినా మరో వారంలో నైనా టికెట్ల ధరలు పెరగకపోతాయా అని ఎదురు చూసినా నిరాశే మిగిలింది. ఫలితంగా భీమ్లా నాయక్ అంచనాలు అందుకోలేక పోయిందని తెలుస్తోంది.

RRR
RRR

ఇక రాధేశ్యామ్ రావడంతో థియేటర్లు దాని కోసం భీమ్లా నాయక్ సినిమాను తీసేయాల్సి వస్తోంది. సినిమా బతకాలంటే ప్రభుత్వమే చేయూతనివ్వాల్సి ఉంటుంది. కావాలనే జగన్ భీమ్లా నాయక్ సినిమాను ఆడకుండా చేయాలనే కుట్రపూరిత నిర్ణయంతోనే ఇలా చేశారనే వాదన కూడా వస్తోంది. వ్యక్తిగత దురుద్దేశాలతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకే మచ్చ తెస్తాయని విమర్శలు వస్తున్నాయి. కానీ వాటిని సీఎం పట్టించుకోవడం లేదు. దీంతో భీమ్లా నాయక్ నిర్మాతలకు ఇబ్బందులు సృష్టించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో జగన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అభిమానులు సూచిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

  1. […] Megastar Chiranjeevi Wife Surekha:  అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి తన బ్లడ్‌ బ్యాంక్‌లో పని చేసే మహిళ డాక్టర్లు, మహిళలను భార్య సురేఖతో కలిసి సత్కరించారు. మహిళల శ్రమను గుర్తించడానికి ఈ రోజు సరైనదన్నారు. చిన్నప్పుటి నుంచి అమ్మ పడే కష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టే మీ అందరి కోసం ఈ చిరు సత్కారం అన్నారు. తాను సక్సెస్‌ ఫుల్‌ హీరోగా మారడానికి తన భార్య సురేఖ కారణమని పేర్కొన్నారు. […]

  2. […] Prabhas Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది. అసలు సినిమాకి బడ్జెట్ పెరిగితే.. దర్శక నిర్మాతలు వెంటనే రెండు పార్ట్స్ అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ రెండు భాగాల ట్రెండ్ బాహుబలితో ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో సర్వసాధారణం అయిపోయింది. ఒక సినిమాకు రెండు భాగాలు అంటే.. రెండు సినిమాలకు వచ్చే అంత డబ్బు వచ్చినట్టే. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular