Batwara 1947 Trailer Review: బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి గత కొద్ది రోజులుగా వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా పాప్ అవుతున్నాయి. ‘దురంధర్’ సినిమా కొంతవరకు వాళ్లకు ఊపిరి పోసిందనే చెప్పాలి. ఈ సినిమా రెండు పార్టులు అద్భుతమైన విజయాలను సాధించడంతో అక్కడి నుంచి బాలీవుడ్ దర్శకులకు సైతం కొన్ని ఆశలైతే చిగురించాయి. ఎలాగైనా సరే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సన్నీ డియోల్ హీరోగా ‘బట్వారా 1947’ అనే ఒక సినిమానైతే చేస్తున్నారు. 1947 వ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. అమీర్ ఖాన్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండటం విశేషం… ఈ సినిమాలో ప్రీతిజింతా కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఇక సన్ని డియోల్ ఈ మధ్యకాలంలో చాలా మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ‘గదర్ 2’ సినిమా నుంచి సక్సెస్ ని సాధించడంతో ఆయన ఆ తర్వాత ‘జాట్’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సబ్జెక్టుల వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. బట్వారా ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉంది.
1947 టైమ్ లో మతాల మధ్య జరిగే గొడవలు అలాగే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు వీటన్నింటిని మిళితం చేసి ఒక స్టోరీని ఐతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజువల్స్ కూడా బాగున్నాయి ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉన్నట్టుగా ట్రైలర్ చూస్తే మనకు తెలిసిపోతుంది. అప్పటి రోజులు రీ క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయడానికి వీళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ ట్రైలర్ లో ప్రతిదీ చాలా ఎగ్జైటింగ్ ఉన్నప్పటికి కథ ను ఎలా తీసుకెళ్లబోతున్నారు. దేశ విభజన ను ఎలా చూపిస్తారు. స్టోరీ లో ఏదైనా ఫిక్షన్ యాడ్ చేశారా ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకంగా మారబోతోంది… అది పర్ఫెక్ట్ గా ఉంటే సినిమా ఆడుతుంది లేకపోతే కష్టమే.. ఈ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు 1947 బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఇతర సినిమాల కంటే కూడా చాలా డిఫరెంట్ గా ట్రైలర్ కట్ చేశారు.
అప్పటి నేపథ్యంలో జరిగిన కొన్ని గొడవలు అల్లర్లను బేస్ చేసుకుని సినిమా తెరకెక్కిందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ట్రైలర్ లో కథ ఏంటనేది చెబుతూనే సినిమాలోని కీలక పాయింట్ ఏంటి అనేదాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయకుండా దాచిపెట్టారు… ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…