PBKS vs RCB Preity Zinta : టాస్ ఓడిపోయిన తర్వాత పంజాబ్ జట్టుకు ఏదీ కలిసి రాలేదు. సొంత మైదానమైనప్పటికీ రజత్ పాటిదర్ సేన బౌలర్లు దుమ్మురేపారు. అయ్యర్ జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించారు.. స్టోయినిస్.. మినహా మిగతా వారెవరికి డబుల్ డిజిట్ స్కోర్ చేసే అవకాశం కూడా కల్పించలేదు. ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, నేహల్ వదేరా, ప్రియాన్ష్ ఆర్య.. ముషీర్ ఖాన్.. ఇలా కీలకమైన ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేలా చేశారు. తద్వారా పంజాబ్ జట్టు 20 ఓవర్లు కూడా పూర్తిస్థాయిలో ఆడలేకపోయింది. ప్రత్యర్థి జట్టు ఎదుట పట్టుమని 120 పరుగుల లక్ష్యాన్ని కూడా ఉంచలేకపోయింది. దీంతో బెంగళూరు పను ఈజీ అయిపోయింది. పైగా మైదానం కూడా కలిసి రావడంతో బెంగళూరు దుమ్మురేపింది. 9 సంవత్సరాల తర్వాత మళ్లీ ఐపిఎల్ ఫైనల్ వెళ్లిపోయింది.
కీలకమైన ప్లేయర్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో పంజాబ్ జట్టు సహజమాని ప్రీతిజింటా తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా మైదానాన్ని వీడి వెళ్ళిపోతూ ఉంటే తట్టుకోలేక కన్నీటి పర్యంతమైంది. వాస్తవానికి ప్రీతి జింటా అమెరికాలో ఉంటోంది. అమెరికా దేశస్థుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పంజాబ్ జట్టులో ఆమెకు 23% వాటా ఉంది. ఇటీవల తన టీం కోసం ఏకంగా తోటి సహజమానులపై ఫిర్యాదు కూడా చేసింది. జట్టు కోసం ఇంతటి కష్టాలు పడితే.. కీలకమైన మ్యాచ్లో ఓడిపోయి ఆమెను ప్లేయర్లు ఏడిపించారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని తట్టుకోలేక ప్రీతి జింటా పలుమార్లు తీవ్రమైన నిరాశతో కనిపించింది. ” ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. కాకపోతే వాటిని ఆమె కవర్ చేసుకుంది. ఈ ప్లేయర్లు అంచనాలు అందుకోలేకపోవడంతో ఆమె వేదన మామూలుగా లేదు. ఆ సమయంలో ఆమె గుండె ద్రవించిపోయి ఉంటుంది. జట్టు సహజమానిగా అలాంటి దృశ్యాలు చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పంజాబ్ జట్టు చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. ఈ ప్రయాణం విజయవంతంగా ముగియాలని ఆమె కోరుకుంటే.. ఆటగాళ్లు తమ నిర్ణయాన్ని మరో విధంగా చూపించారు. ఇది ఒకరకంగా ఆమెకు మింగుడు పడని వార్త అంటూ” జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మరోవైపు బెంగళూరు చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో.. పంజాబ్ జట్టుకు మరొక మ్యాచ్ అవకాశం ఉంది. కాకపోతే ఆ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తేనే ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో కూడా పంజాబ్ జట్టు కనుక ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే క్వాలిఫైయర్ -2 లో గెలిచిన జట్టుతో పంజాబ్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో కచ్చితంగా పంజాబ్ విజయం సాధించాల్సి ఉంటుంది.